»   » ‘రేసు గుర్రం’ 100 డేస్ సెంటర్స్ ఇవే...

‘రేసు గుర్రం’ 100 డేస్ సెంటర్స్ ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన 'రేసు గుర్రం' చిత్రం ఏప్రిల్ 10న విడుదలై విజయవంతంగా 100 రోజుల వైపు పరుగులు పెడుతోంది. జులై 19తో ఈచిత్రం వందరోజులు పూర్తి చేసుకోబోతోంది. తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈచిత్రం దుమ్మురేపే కలెక్షన్లు సాధిస్తూ కేవలం 3 వారాల్లోనే రూ. 50 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ చిత్రం 159 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

Race Gurram 100 Days Centers

100 రోజుల జరుపుకోబోయే సెంటర్స్ ఇవే...

నైజాం: 5 సెంటర్స్
సీడెడ్ : 9 సెంటర్స్
క్రిష్ణా జిల్లా: 3 సెంటర్స్
గుంటూరు 4 సెంటర్స్
వైజాగ్ : 1 సెంటర్
ఈస్ట్ గోదావరి: 04 సెంటర్స్
వెస్ట్ గోదావరి: 01 సెంటర్
టోటల్ సెంటర్స్: 27

రేసు గుర్రం చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

English summary
Stylish Star Allu Arjun's 'race gurram' is completing its 100 days run directly in 27 centers across AP and Telangana states on 19th of July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu