»   » వంగవీటి మూవీ..... వర్మకు 'రాధా రంగా మిత్రమండలి' వార్నింగ్

వంగవీటి మూవీ..... వర్మకు 'రాధా రంగా మిత్రమండలి' వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విజయవాడ రాజకీయాలు, రౌడీయిజాన్ని బేస్ చేసుకుని ఇప్పటికే పలు వివాదాస్పద సినిమాలు చేసిన వర్మ.... త్వరలో 'వంగవీటి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వంగవీటి మోహనరంగ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తుండటంతో అసలు వర్మ ఈ చిత్రంలో ఏం చూపించబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో 'రాధా రంగా మిత్రమండలి' వర్మకు, చిత్మ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చింది. విజయవాడలో ఏర్పాటు చేసిన సమాశంలో వారు మాట్లాడుతూ....'వంగవీటి' సినిమాలో వంగవీటి రంగా కుటుంబాన్ని కించపరిచేలా చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

అనుమానం ఉంది

అనుమానం ఉంది

సినిమాలో వాస్తవాలను వక్రీకరించినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అలాంటివి ఏమైనా సినిమాలో చూపిస్తే థియేటర్ల వద్ద ఉద్రిక్తతలు తప్పవని, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు

ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు

థియేటర్ల వద్ద తలెత్తే ఏ సంఘటనకైనా తమకు సంబంధం లేదని, థియేటర్ యాజమాన్యాలు, వర్మే వాటికి బాధ్యత వహించాలని ఈ సంద్భంగా రాధా రంగా మిత్రమండలి సభ్యులు తేల్చి చెప్పారు.

ముందు వివరణ ఇవ్వాలి

ముందు వివరణ ఇవ్వాలి

రంగ తనయుడు రాధాకృష్ణ చెప్పిన కొన్ని అభ్యంతరాలను పట్టించుకోకుండా వర్మ సినిమా తీశాడని ఈ సందర్భంగా మిత్రమండలిసభ్యులు ఆరోపించారు. ఈ విషయమై రాధాకు వివరణ ఇచ్చిన తరువాతే విడుదల చేయాలని మిత్రమండలి సభ్యులు డిమాండ్ చేసారు.

కమ్మ కాపు... సాంగ్ తొలగింపు: ‘వంగవీటి’ మూవీ ఇష్యూపై మెట్టు దిగిన వర్మ!

కమ్మ కాపు... సాంగ్ తొలగింపు: ‘వంగవీటి’ మూవీ ఇష్యూపై మెట్టు దిగిన వర్మ!

కమ్మ కాపు.... అనే సాంగును వంగవీటి సినిమా నుండి తొలగిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ సినిమా భావోద్వేగాలతో కూడుకున్నదని... ఏ ఒక్కరికీ సంబంధించినది కాదని వర్మ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘వంగవీటి’లో రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, ముద్రగడ, దాసరి పాత్రలు...

‘వంగవీటి’లో రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, ముద్రగడ, దాసరి పాత్రలు...

‘వంగవీటి'లో రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, ముద్రగడ, దాసరి పాత్రలు... పూర్తి వివరాల కోసంక్లిక్ చేయండి

వంగవీటి ఆడియో వేడుక డిసెంబర్ 3న వర్మ ఏం చెబుతాడో?

వంగవీటి ఆడియో వేడుక డిసెంబర్ 3న వర్మ ఏం చెబుతాడో?

డిసెంబర్ 3న జరిగే ఆడియో వేడుకలో వర్మ వంగవీటి సినిమాకు సంబంధించి ఇంకా ఏదైనా సంచలన విషయాలు మాట్లాడబోతున్నారా? అనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Radha Ranga Mitra Mandali warns Ram Gopal Varma about Vangaveeti movie. Vangaveeti is an upcoming Indian Telugu film written and directed by Ram Gopal Varma. The film is based on the lives of politician Vangaveeti Mohana Ranga, and his brother Vangaveeti Radha Krishna Rao Sr., and their altercation with communist dominated Vijayawada of the 1980's Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu