twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe shyam: ప్రభాస్ కంటే ముందు ఆ హీరో చేయాల్సింది.. ఎందుకు సెట్టవ్వలేదంటే?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం సాహో సినిమా తో హిందీలో అయితే మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ సౌత్ లో మాత్రం ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం రాధే శ్యామ్ పరిస్థితి చూస్తుంటే మళ్లీ అలాంటి రిజల్ట్ అందుతుందేమో అని అనుమానంగా ఉంది. సాహో కనీసం హిందీ లో అయినా సక్సెస్ అయింది. కానీ ఈసారి రాధే శ్యామ్ మాత్రం హిందీలో కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే రాధే శ్యామ్ సినిమా ఫస్ట్ ఐడియా పుట్టినప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ హీరోకు వినిపించారట. ఇక ఆ హీరో ఎవరు ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాల్లోకి వెళితే..

     ఆరేళ్ళ కష్టం..

    ఆరేళ్ళ కష్టం..

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ జోనర్ లో ప్రేమకథను అందించాలి అనే ప్రభాస్ అలాగే యు.వి.క్రియేషన్స్ కూడా రాధే శ్యామ్ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసింది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ గా గెలుస్తుంది అని అందరూ గట్టిగా నమ్మారు. ఈ సినిమా కోసం దర్శకుడు రాధాకృష్ణ కూడా దాదాపు ఆరేళ్ల వరకు కష్ట పడినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

    16 ఏళ్ల కిందటనే..

    16 ఏళ్ల కిందటనే..

    రాధే శ్యామ్ సినిమా కథ దర్శకుడు రాధాకృష్ణ గత ఆరేళ్లుగా రాసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే ఐడియా మాత్రం 16 ఏళ్ల కిందటనే పుట్టింది అని రాధాకృష్ణ వివరణ ఇచ్చాడు. అసలు మొదట ఐడియా సృష్టించింది తన గురువు చంద్రశేఖర్ యేలేటి అని కూడా చెప్పాడు. ఆయన దగ్గరనుంచి ఈ కథను తీసుకున్నట్లు చెప్పిన రాధాకృష్ణ ఎంతో మంది రచయితలతో కలిసి ఈ సినిమా కథను డెవలప్ చేసినట్లుగా వివరణ కూడా ఇచ్చాడు.

     హీరోలకు తగ్గట్టుగా..

    హీరోలకు తగ్గట్టుగా..

    అసలైతే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ ఐడియా రాసుకున్నప్పుడు మొదట కొంత మంది హీరోలకు కూడా వినిపించటం జరిగిందట. ముందుగానే కథను రాసుకోకుండా హీరోలకు తగ్గట్టుగా కథను డెవలప్ చేయాలి అని చంద్రశేఖర్ ఏలేటి కొంత మంది హీరోలకు కథ మేయిన్ పాయింట్ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు ఒక స్టార్ హీరో అయితే కథ ఫైనల్ అయ్యే పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఐడియా క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.

    వెంకటేష్ తో చర్చలు

    వెంకటేష్ తో చర్చలు


    చంద్ర శేఖర్ యేలేటి మొదట రాధేశ్యామ్ ఐడియా అనుకున్నప్పుడు వెంకటేష్ కు అయితే బాగుంటుంది అని ఆలోచించాడట. మొదట ఇద్దరు హీరోలను కలిసినప్పటికీ ఆ తర్వాత అతను మళ్ళీ వెంకటేష్ తోనే కొన్ని రోజుల పాటు కథ గురించి చర్చలు జరపాల్సి వచ్చిందట. వెంకటేష్ కూడా మొదట్లో ఐడియా గురించి చాలా ఇంట్రెస్ట్ చూపించాడట. కానీ ఏమైందో ఏమో గాని మరి కొన్ని రోజులకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

    అలా క్యాన్సిల్

    అలా క్యాన్సిల్

    వెంకటేష్ ఆ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు అవుతుంది అని కూడా ఆలోచించి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిర్మాత సురేష్ బాబు కూడా ప్రాజెక్ట్ చేయడం కాస్త రిస్కుతో కూడుకున్న పని అని సలహా ఇవ్వడంతో వెంకటేష్ తన సోదరుడి మాట కారణంగా కూడా ఆ ప్రాజెక్టును క్యాన్సల్ చేసుకున్నాడని సమాచారం. అనంతరం అదే ఐడియాను ఒకప్పుడు చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాధాకృష్ణ తీసుకొని తన సొంతంగా డెవలప్ చేసి ప్రభాస్ కు చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ సెట్టయ్యింది.

    Recommended Video

    Radhe Shyam - Prabhas Interview | Pooja Hegde| Filmibeat Telugu
    ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేసిన వెంకీ..

    ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేసిన వెంకీ..

    ఏదేమైనా కూడా వెంకటేష్ కథల విషయంలో కొన్ని సార్లు తీసుకునే నిర్ణయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేవలం రాధే శ్యామ్ సినిమా మాత్రమే కాకుండా ఇటీవల విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు కథను కూడా మొదట వెంకటేష్ కి వినిపించారు. కానీ సినిమా కథ అంతగా కనెక్ట్ కాకపోవడంతో అలాగే స్లోగా సాగే కథనం ప్రేక్షకులు ఇష్టపడక పోవచ్చు అని వెనుకడుగు వేశాడు. ఇక ఈ రెండు సినిమాలు కూడా కొంత గ్యాప్ లోనే విడుదల అయి బాక్సాఫీసు వద్ద నిరుత్సాహ పరిచాయి.

    English summary
    Radhe shyam movie first choice before prabhas accept
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X