»   » బూతు పాత్రలే వస్తు్న్నాయంటూ గోలెత్తిపోతోంది

బూతు పాత్రలే వస్తు్న్నాయంటూ గోలెత్తిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇండస్ట్రీలో ఓ చిత్రమైన ట్రెడిషన్ కొనసాగుతూంటుంది. ఒకరు ఓ చిత్రంలో ఓ రకమైన పాత్ర చేస్తే...అది క్లిక్ అయితే ..వద్దు బాబోయ్ అన్నా అవే పాత్రలు ఆఫర్ చేస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు రాధికా ఆప్టే కు జరుగుతోంది. రక్త చరిత్రతో తెలుగు వారికి పరిచయమైన ఆమె తర్వాత బాలకృష్ణ లెజండ్ లో చేసింది. బిజీ కాలేదు కానీ.. తెలుగులో మళ్లీ బాలయ్యే లయిన్ లో ఆఫర్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ గౌరవప్రదమైన ఆఫర్స్ ఆమెకు వస్తున్నాయి. అయితే హిందీకి మాత్రం ఆమె సీన్ రివర్స్ అయ్యింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హిందీలో ఆమెకు అన్నీ బూతు పాత్రలే వస్తున్నాయి. అక్కడ ఆమె రీసెంట్ చిత్రం బదలాపూర్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ ఆ తరహా పాత్రలు రావటంతో ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా హంటర్ చిత్రం ప్రోమో వచ్చాక మరీ పరిస్ధితి దారణమైపోయింది. ఆమెను ఎప్రోచ్ అయ్యే నిర్మాతలు, దర్శకులు సాఫ్ట్ పోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది.

రాధికా ఆప్టే మాట్లాడుతూ... "బదలాపూర్ చిత్రంలో చేసాక..అందరూ నాకు సాఫ్ట్ ఫర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు..నాకు షాకింగ్ గా ఉంది.", అంటూ చెప్పుకొచ్చారామె. అయితే అడల్ట్ కామెడీ హంటర్ రిలీజయ్యాక పరిస్ధితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అంటున్నారు.

Radhika apte cries for getting soft porn roles

మరో పక్క ఆమె తాజాగా ఓ చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్లు స్వయంగా తెలియచేసారు. అయితే ఆ సన్నివేశాలు చూసే అవకాసం ఇండియావారికి ఉండకపోవచ్చు అంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు రక్త చరిత్రతో పరిచయమైన రాధికా ఆప్టే తెలపడం విశేషం. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా తమిళ పరిశ్రమకు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది.

మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటిస్తున్న రాధికా ఆప్టే తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ, తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం గురించి ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అన్నారు.

అయితే, ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు నగ్నంగా నటించానని చెప్పారు. అయితే, ఈ చిత్రం ఇండియాలో విడుదల అయితే, ఆ సన్నివేశాలు తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.

ఇక ఈ హీరోయిన్ కి చెందిన ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని చెప్పుకొచ్చింది.

English summary
“After acting in Badlapur, people are offering me only soft porn roles. I’m really shocked”, said Radhika Apte, talented theatre artist who debuted in Telugu films with Ram Gopal Varma’s Rakta Charitra.
Please Wait while comments are loading...