»   » తప్పు చేయలేదు, సెక్స్ సీన్లు చేసాం అంతే... సిగ్గుపడాల్సిందేముంది?

తప్పు చేయలేదు, సెక్స్ సీన్లు చేసాం అంతే... సిగ్గుపడాల్సిందేముంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్య కాలంలో న్యూడ్, సెక్స్ లాంటి వివాదాస్పద అంశాల్లో బాగా వినిపిస్తున్న హీరోయిన్ రాధిక ఆప్టే. గత పది రోజులుగా రాధిక ఆప్టే పేరు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 'పర్చేడ్' అనే సినిమాలో ఆమెకు సంబంధించిన శృంగార సన్నివేశాలు లీక్ కావడమే అందుకు కారణం.

ఈ సెక్స్ సీన్లలో ఆమెతో పాటు ఆదిల్ హుస్సేన్ అనే బాలీవుడ్ నటుడు నటించారు. ఇటీవల స్పాట్ బాయ్ ఇంటర్వ్యూలో ఆదిల్ హుస్సేన్ 'పర్చేడ్' సినిమాకు సంబంధించిన అంశాలపై స్పందించారు. ఆ సక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూలో సెక్స్ సీన్ల లీక్ విషయమై కూడా మాట్లాడారు.

'పర్చేడ్ సినిమాలో కథ ప్రకారం నేను, రాధిక ఆప్టే కలిసి శృంగార సీన్లలో నటించిన మాట నిజమే. అయితే సినిమా రిలీజ్ ముందే సీన్లు లీక్ అవ్వడం వల్ల అదో పెద్ద వివాదం అయింది. ఈ లీక్ పై మేము(ఆదిల్-రాధిక) బాధ పడటం లేదు, అలాంటి అవసరం కూడా లేదు. బాధ పడటానికి మేమేమీ తప్పు చేయలేదు, సినిమాలో కలిసి నటించాం. అంతకు మించి ఏమీ లేదు' అని ఆదిల్ హుస్సేన్ అన్నారు.

ఈ సినిమా ఇండియాలో రిలీజ్ కానప్పటికీ యూఎస్ఏ, జర్మనీలో సినిమా హాళ్లలో ప్రదర్శించాం. అక్కడి నుండే ఈ సీన్లు లీక్ అయ్యాయని భావిస్తున్నాం. సినిమా విషయంలో సెన్సేషన్ చేయడానికి సినిమా యూనిట్ వారే ఈ లీక్ చేసారనే వాదనలో నిజం లేదు అన్నారు అదిల్.

సినిమాలోనూ..

సినిమాలోనూ..

లీకైన సీన్లు సినిమాలో భాగమేనా? కాదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ‘లీకైన సీన్లు సినిమాలోనివే, స్క్రిప్టు డిమాండ్ మేరకే సినిమాలో ఆ సీన్లు ఉన్నాయి. కేవలం సెన్సేషన్ కోసం చేసింది కాదు' అన్నారు.

రాధిక తో ఆ సీన్లు చేయడంపై

రాధిక తో ఆ సీన్లు చేయడంపై

రాధిక ఆప్టేతో ఆ సీన్లు చేయడంపై ఆదిల్ హుస్సేన్ స్పందిస్తూ...‘ఇలాంటి సీన్లు చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇండియాలో ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి చాలా మంది ఇష్టపడరు. అందుకు నేను కూడా మినహాయింపు ఏమీ కాదు' అన్నారు.

సైలెన్స్ బ్రేక్ చేయాలి..

సైలెన్స్ బ్రేక్ చేయాలి..

సెక్స్, సెక్సువాలిటీ అంశాలపై ఓపెన్ గా మాట్లాడుకోవడమే మంచి పరిణామం. నటుడిగా అలాంటి వాటిపై నేను మౌనంగా ఉండటం సరికాదు. అది కూడా హ్యూమన్ బిహేవియర్ లో భాగమే అన్నారు అదిల్ హుస్సేన్.

ఆ సీన్లు చేసేప్పుడు కంఫర్ట్

ఆ సీన్లు చేసేప్పుడు కంఫర్ట్

సినిమాలో సెక్స్ సీన్లు చేసే ముందు ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇద్దరి మధ్య కంఫర్ట్ లెవల్స్ పెరిగిన తర్వాతే ఆ సీన్లు షూట్ చేసారు అని ఆదిల్ హుస్సేన్ తెలిపారు.

సెన్సార్ గురించి

సెన్సార్ గురించి

ఇపుడు సెన్సార్ బోర్డ్ నుండి ఇలాంటి వాటికి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను, ఇందులో సమాజానికి కీడు చేసే అంశాలేవీ లేవు అని ఆదిల్ హుస్సేన్ తెలిపారు.

ఉడ్తా పంజాబ్ విక్టరీ

ఉడ్తా పంజాబ్ విక్టరీ

ఆ మధ్య ఉడ్తా పంజాబ్ విషయంలో సెన్సార్ బోర్డ్ తీరు వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు తీరుపై ఉడ్తా పంజాబ్ మూవీ పోరాడి విజయం సాధించడం సంతృప్తి ఇచ్చిందని ఆదిల్ హుస్సేన్ తెలిపారు.

ఒకే రాత్రిలో..

ఒకే రాత్రిలో..

లీకైన సెక్స్ సీన్ షూట్ చేసేందుకు ఎంత సమయం పట్టిందనే అంశంపై ఆదిల్ హుస్సేన్ స్పందిస్తూ... ఒక రాత్రిలో షూటింగ్ పూర్తయిందని తెలిపారు.

English summary
Radhika Apte is a perfect example of 'Bold & Beautiful.' Recently, the sex scenes from her film, Parched leaked online but the actress doesn't give a damn about it! In an interview with Spotboye, Radhika's co-star Adil Hussain revealed that they are not at all worried about it! He told, "We (Adil & Radhika) did speak, but we are not worried. Trust me, we are absolutely okay. And it shouldn't be termed as a 'leak' because the film has run in cinema halls in the US and Germany."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu