»   » దానికి నేను ఒప్పుకోలేదు, మళ్ళీ ఆ సెక్స్ కోణాన్ని పైకి తెచ్చిన రాధికా ఆప్టే

దానికి నేను ఒప్పుకోలేదు, మళ్ళీ ఆ సెక్స్ కోణాన్ని పైకి తెచ్చిన రాధికా ఆప్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇక్కడ ఉన్న ఈ చీకటి కోణం మీద చాలామంది హీరోయిన్లే కొన్ని విషయాలని బయటపెట్టారు. నెమ్మదిగా ఆ గొడవ కాస్త చల్ల బడింది. గతంలో రక్త చరిత్ర, కబాలి, లెజండ్ చిత్రాల హీరోయిన్ రాధికా ఆప్టే కూడా తెలుగు చిత్ర సీమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని, ఒక హీరో తనని డైరెక్టుగా కోరిక తీర్చమని అడిగాడని ఆమె ఆరోపించిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. అదేంటో గానీ ఉన్నట్టుండీ రాధికా మళ్ళీ ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని మళ్ళీ తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసింది.

 బోల్ద్ నెస్ కొంచం ఎక్కువే

బోల్ద్ నెస్ కొంచం ఎక్కువే

మామూలుగానే మేడమ్ కి డేరింగ్, బోల్ద్ నెస్ కొంచం ఎక్కువే బాలీవుడ్‌ చిత్రాల్లో అర్ధనగ్నంగా నటిస్తూ, ఆ ఫొటోలతోనే ఎక్కువగా పాపులర్ ఈ సంచలన నటి. అదేమని ఎవరైనా విమర్శిస్తే, నా శరీరం, నా ఇష్టం అంటూ డేర్‌గా అనేస్తుంది. బయట ఎవరన్నా ఆ విషయాన్ని ఎత్తినా నోరుమూయించగల మాటల చాతుర్యమూ ఉంది.

రాధిక ఆప్టే

రాధిక ఆప్టే

ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిసారించిన రాధిక ఆప్టే దక్షిణాది చిత్రపరిశ్రమపై మరోసారి నిప్పులు చెరిగింది . అవకాశాల కోసం హీరోయిన్లను అడ్జెస్ట్‌ అవ్వాలంటారని నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ లాంటి కొందరు సంచలన వ్యాఖ్య చేశారు. అవి అప్పట్లో ప్రకంపనలు సృష్టించిన మాట నిజమే అయినా, అలాంటి వాతావరణం సద్దుమణిగిన తరువాత నటి రాధిక ఆప్టే మరోసారి అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చింది.

హీరోయిన్లను పడక గదికి రమ్మని

హీరోయిన్లను పడక గదికి రమ్మని

దక్షిణాదిలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉంది అని కామెంట్ చేసింది.తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని, ఒక నిర్మాత కథా చర్చలకు పిలిచి పడక గదికి రమ్మని ఒత్తిడి చేశాడని, అయితే తానందుకు తలవంచలేదని పేర్కొంది.

కోలీవుడ్ కూడా భయపడ్డట్టుంది

కోలీవుడ్ కూడా భయపడ్డట్టుంది

అందుకేనేమో తనకు దక్షిణాదిలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదని చెప్పింది. ఇంతకీ అవకాశాలు రాకపోయిన తర్వాతేకదా ఈ చీకటి విషయాలని చెప్పింది... ఇప్పుడేమిటి చెప్పినందుకే అవకాశాలు రావటం లేదంటోందేమిటీ?? మొత్తానికి అటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గేసరికి మళ్ళీ టాలీవుడ్ లో ఉన్న పాత విషయాలు గుర్తొచ్చాయేమో..! పాపం అసలే ఆ మాటల దెబ్బకి కోలీవుడ్ కూడా భయపడ్డట్టుంది అక్కడా అమ్మగారికి గేట్లు మూసేసారు మరి.

English summary
actress has again talked about producers forcing her to sleep. She said, "I am not trying to point fingers on anyone but casting couch is a big reality. People in South Cinema act like it is necessary to sleep and I refuse to do so. If that has cost me any films I don't know but I am not going to succumb to any pressure like that!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X