»   » నిర్మాతగా మారబోతున్న మాజీ సీఎం భార్య...

నిర్మాతగా మారబోతున్న మాజీ సీఎం భార్య...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడ నటి కుట్టి రాధికా అలియాస్ రాధిక కుమార స్వామి త్వరలో సినీ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయిన కుమార స్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు.

Radhika Kumaraswamy To Turn Producer

దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసారు. ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఆ తర్వాత కుమార స్వామి రాజకీయాల వైపు అడుగులు వేసి ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు.

భర్త సహకారంతో రాధిక కుమార స్వామి నిర్మాతగా మారబోతున్నారు. త్వరలో కన్నడలో అక్కడి స్టార్ హీరోలతో మూడు భారీ ప్రాజెక్టులు చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో ఓ దానికి ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

English summary
Radhika Kumaraswamy is all set to become a producer soon.
Please Wait while comments are loading...