»   » మాజీ సీఎం వైఫ్ మళ్లీ హీరోయిన్‌గా వస్తోంది, ఇద్దరూ విడిపోయారా?

మాజీ సీఎం వైఫ్ మళ్లీ హీరోయిన్‌గా వస్తోంది, ఇద్దరూ విడిపోయారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కర్నాటక మాజీ సీఎం, జనతాదల్ పార్టీ లీడర్ కుమారస్వామి పదేళ్ల క్రితం కన్నడ హీరోయిన్ రాధికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుమారస్వామితో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది.

పెళ్లి తర్వాత రాధిక కొన్ని సినిమాలు చేసినా అందులో ఏవో చిన్న చిన్న పాత్రలే తప్ప హీరోయిన్ గా మాత్రం చేయలేదు. మళ్లీ ఆమె హీరోయిన్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

రవిచంద్ర మూవీ

రవిచంద్ర మూవీ

కన్నడ దర్శకుడు రవిచంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో రాధిక కీ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రవిచంద్ర కూడా ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.

విడిపోయారా?

విడిపోయారా?

రాధిక, కుమారస్వామి దంపతులపై మరో వార్త కూడా వినిపిస్తోంది. కొంతకాలంగా ఇద్దరూ విడిగా ఉంటున్నారని టాక్. భర్త అడ్డంకి లేదు కాబట్టే రాధిక మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న సమయంలోనే..

డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న సమయంలోనే..

కుమారస్వామి గతంలో పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా చేసిన సంగతి తెలిసిందే.ఆ సమయంలోనే రాధికతో ఏర్పడిన పరిచయం వీరి పెళ్లికి దారి తీసింది. అప్పటికే కుమారస్వామికి అనిత అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చి రాధికను పెళ్లాడారు కుమారస్వామి.

కొడుకుతో జాగ్వార్

కొడుకుతో జాగ్వార్

కుమారస్వామి మొదటి భార్య కొడుకు నిఖిల్ గౌడ ఇటీవలే ‘జాగ్వార్' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని దాదాపు 70 కోట్ల ఖర్చుతో కుమారస్వామి నిర్మించారు. అయితే ఈ చిత్రం భారీగానే నష్టాలనుమిగిల్చింది. ఈ చిత్రానికి బాహుబలి దర్శకుడు విజయేంద్రప్రసాద్ కథ అందించారు.

English summary
Karnataka former Chief Minister and Janata Dal leader Kumaraswamy wife Radhika Kumaraswamy resumed her film career almost after a decade.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu