‘రేడియో మిర్చి’ మ్యూజిక్ అవార్డ్స్
నాగార్జున మాట్లాడుతూ ' సినిమాల్లోకి రాకముందు నుంచే కోటి పాటల్ని వింటుండే వాడిని. ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం. నేను చేసిన 'హలో బ్రదర్' సినిమాకు కోటి అద్భుతమైన సంగీతాన్నందించాడు. అందులో 'ప్రియ రాగాలే..' పాటంటే నాకు చాలా ఇష్టం' అన్నారు.
ఈ అవార్డ్స్ లో 'శ్రీరామరాజ్యం' చిత్రం అత్యధికంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, నేపథ్య గాయనిగా శ్రేయ ఘెషల్, గేయ రచయితగా జొన్న విత్తుల, అత్యధిక ప్రజాదరణ పొందిన పాటగా 'జగదానంద తారక' అవార్డులను పొందాయి. ఉత్తమ కమర్షియల్ ఆల్బమ్ అవార్డును 'దూకుడు' చిత్రానికిగాను తమన్ అందుకున్నారు. ఈ వేడుకలో గాయనీగాయకులు ఆలపించిన పాటలు శ్రోతల్ని అలరించాయి. ఉషా ఉతుప్ పాడిన 'కొలవెరి 'పాట శ్రోతల్ని ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, కోదండరామిరెడ్డి, వెంకటేష్, మణి శర్మ, ఎస్.కె. రాజ్ కుమార్, రమణ గోగుల, ధనుష్, అనిరుధ్, జీవీ ప్రకాష్ కుమార్, కుష్భూ, మంచు లక్ష్మీ, కామ్నా జఠ్మలానీ, కృతి కర్భందా తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












