26న ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’

ఈ నేపథ్యంలో తెలుగు అవార్డు జ్యూరీ కమిటీ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ కమిటీ సభ్యుడు డి. సురేష్ బాబు మాట్లాడుతూ 'రేడియో మిర్చి సంస్థ గత నాలుగేళ్లుగా మ్యూజిక్ అవార్డులను అందజేస్తోంది. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి నిష్పక్షపాతంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడం జరిగింది' అన్నారు.
'మొత్తం 122 సినిమాలు, 672 పాటలను పరిశీలించి ఐదుగురిని ఎంపిక చేసాం. ఆ విజేతలెవరన్నది ఈ నెల 26న జరిగే అవార్డుల వేడుకలో తెలుస్తుందని తెలిపారు. సంగీత ప్రపంచంలోని ప్రతిభావంతులను ప్రొత్సహిస్తూ అవార్డులు అందించడం అభినందనీయమని ఆర్ పి పట్నాయక్ పేర్కొన్నారు.
పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ సారి చాలా విలువైన, అమూల్యమైన పాటలు వచ్చాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేసాం అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, మోహన కృష్ణ ఇంద్రగంటి, హాసం రాజా, రమణ గోగుల, కౌసల్య, రామజోగయ్య శాస్త్రి, రేడియో మిర్చి సీఈఓ ప్రశాంత్ పాండే తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











