»   »  భారీగా ఫ్యాన్స్, ఒకరి మరణం: బిక్కు బిక్కు మంటూ సన్నీ లియోన్!

భారీగా ఫ్యాన్స్, ఒకరి మరణం: బిక్కు బిక్కు మంటూ సన్నీ లియోన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన తాజాగా చిత్రం 'రాయీస్' జనవరి 25న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ట్రైన్ టూర్ ప్లాన్ చేసారు. ముంబై నుండి ఢిల్లీ వరకు ట్రైన్లో వెలుతూ సినిమాకు ప్రచారం కల్పించాలనేది వారి ముఖ్య ఉద్దేశ్యం.

షారుక్ తో పాటు ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసిన సన్నీ లియోన్ కూడా ఈ ట్రైన్ లో ఉన్నారు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా బురఖా వేసుకుని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సన్నీ లియోన్ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుందో ఆయా ప్రాంతాల్లో షారుక్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వడోదర స్టేషన్లో షారుక్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈక్రమంలో ఒక అభిమాని మరణించారు.

 సన్నీ లియోన్ భయం భయంగా

సన్నీ లియోన్ భయం భయంగా

షారుక్ ను చూసేందుకు ఇంత మంది అభిమానులు పోటెత్తడం, ఒకరు మరణించిన విషయం సన్నీ లియోన్‌ను భయాందోళనకు గురి చేసింది. దీంతో ట్రైన్లో బిక్కు బిక్కుమంటూ గడిపింది.

 ధైర్యం చేయలేదు

ధైర్యం చేయలేదు

కనీసం ట్రైన్ గేటు వద్దకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడానికి కూడా సన్నీ లియోన్ దైర్యం చేయలేదు. ట్రైన్లో కర్టెన్ చాటు నుండే చూస్తూ ఉండిపోయింది.

 అభిమాని మృతికి షారుక్ సంతాపం

అభిమాని మృతికి షారుక్ సంతాపం

తనను చూసేందకు వచ్చిన అభిమాని గుండెపోటుతో మరణించిన ఘటనపై షారుక్ స్పందించారు. అభిమాని మృతికి సంతాపం ప్రకటించారు.

rnrn

సన్నీ లియోన్ సాంగ్

రాయీస్ చిత్రంలో సన్నీ లియోన్ చేసిన స్పెషల్ సాంగ్. ఈ పాటకు యూట్యూబులో అద్భుతమైన స్పందన వచ్చింది. 82 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

English summary
‘Raees’ rail tour The journey started from Mumbai on Monday evening. Sunny Leone who has performed to the foot-tapping track 'Laila O Laila' was also on-board along with the film's crew. Sunny Leone petrified by the frenzy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu