»   »  రజినీ సినిమా, చిరంజీవి రీమేక్... దానికి లారెన్స్ మళ్ళీ రీరీమేక్ ఏందిదీ...!?

రజినీ సినిమా, చిరంజీవి రీమేక్... దానికి లారెన్స్ మళ్ళీ రీరీమేక్ ఏందిదీ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా మారిన వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయనే హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినవి ఉన్నాయి. తాజాగా ఇదే కోవలో లారెన్స్ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమానే రీమేక్ చేసేందుకు రదీ అయ్యాడు. 1982లో వచ్చిన రజనీ 'మూండ్రు మొగమ్' సినిమాను రీమేక్ చేయనున్నట్లు లారెన్స్ స్పష్టం చేశారు.

ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను పరాయి భాషలలో తెరకెక్కిస్తూ మంచి వసూళ్ళను రాబడుతున్నారు చిత్ర నిర్మాతలు. స్టార్ హీరోల నుండి యంగ్ జనరేషన్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఇదే మంత్రాన్ని పఠిస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ కాస్త వైవిధ్యంగా ఆలోచించాడు. ఇటీవల విడుదలైన సినిమాలు కాకుండా 1982లో రజినీకాంత్ నటించిన 'మూండ్రు మొగమ్' అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నాడట.

రజనీ సినిమాను రీమేక్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. చాలా కాలం క్రితం రజనీకాంత్ తమిళంలో 'మూండ్రు మొగమ్' అనే సినిమా చేశాడు. అప్పట్లో అది ఘన విజయాన్ని సాధించింది. చిన్నప్పుడు తాను థియేటర్లో చూసి ఆనందించిన ఆ సినిమాను రీమేక్ చేస్తుండటం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని లారెన్స్ అంటున్నాడు. ఆల్రెడీ ఆ సినిమా రీమేక్ గా 'ముగ్గురు మొనగాళ్లు' పేరుతో చిరంజీవి చేసిన సినిమా ఇక్కడ కూడా సక్సెస్ ను సాధించింది.

raghava lawrence

తాను రజినీకాంత్ అభిమాని అని, ఈ సినిమాను అప్పట్లో అనేక సార్లు తాను చూసినట్టు చెబుతున్నాడు. తన అభిమాన హీరో సినిమాను తాను రీమేక్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మూండ్రు మొగమ్ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా ముగ్గురు మొనగాళ్ళు టైటిల్ తో విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తానికి లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయం అటు రజినీకాంత్, ఇటు చిరంజీవి సినిమాలను రీమేక్ చేసినట్టు అవుతుంది. నిజానికి ఇలా ఒకే భాసహలో వచ్చిన సినిమాని మళ్ళీ రీమేక్ చేసి లాభాలు గడించటం కొత్తేం కాదు. గతం లోకూడా రజినీకాంత్ హీరోగా వచ్చిన "బిల్లా" (హిందీ డాన్) ని మళ్ళీ అజిత్ అదే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

అయితే ఇప్పుడు లారెన్స్ చేసే ప్రయోగం ఇంకా స్పెషల్. ఎందుకంటే అటు తమిళం లో రజినీకాంత్ కేకాదు ఇటు చిరంజీవికీ మంచి ఫ్యాన్ ఈ కొరియో గ్రాఫర్. ఇక ఇందస్ట్రీలలో ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా అక్కద రజినీ ఎంతో ఇక్కడ చిరంజీవీ అంతే ఆ విధంగా రెందు భాషలలోనూ ఈ సినిమా ప్రత్యేకమే కానుంది... అయితే చిత్రీకరణలో ఏమాత్రం పొరపాటు జరిగినా సినిమా ఫ్లాపవటం అటుంది లారెన్స్ ఇమేజ్ కూడా అదే రేంజ్ లో దెబ్బతింటుంది ఈ మాట లారెన్స్ కి ఎవరైనా చెప్పారో లేదో మరి.

English summary
Lawrence Raghavendhra to reprise Rajinikanth's iconic triple roles in Moondru Mugam remake
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu