»   » ‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అంటూ మంచు లక్ష్మి

‘ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా’ అంటూ మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు విష్ణు, వీరూ పోట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దూసుకెళ్తా' . ఈ సినిమా కోసం మంచు విష్ణు ఇంట్రడక్షన్ సాంగ్ ని చిత్రీకరించారు. అయితే ఆ పాట ఎవరి మాటల్లో వింటే బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు. వేరెవరో ఎందుకు అక్క మంచు లక్ష్మీ ప్రసన్ననే పెడదామనుకున్నారు విష్ణు. ఆమెని అడగడం ఆమె ఓకే చేయడం జరిగిపోయాయి. 'ఉగ్గుపాల వయసులోనే సిగ్గునొదిలేశా' అనే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మంచు విష్ణు చెబుతున్నారు. హైదరాబాద్ గంధర్వ మహల్ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు.

అక్క మీద క్లాప్‌ కొట్టడానికి 'పోటుగాడు' మంచు మనోజ్‌ కూడా వచ్చాడు. అలాగే లక్ష్మీది ప్రత్యేక పాత్ర కాబట్టి, పాటల చిత్రీకరణలో మాంత్రికుడైన రాఘవేంద్రరావుని దర్శకత్వం వహించమని కోరారు. ఇక మొదలైంది వీరి హంగామా. 'ఉగ్గుపాల వయసులోనే...'' అంటూ లక్ష్మీ అందుకునేసరికి సెట్‌ మొత్తం హడావుడి. సరదాగా సాగిపోయింది చిత్రీకరణ. ఈ మొత్తం సన్నివేశాన్ని మోహన్‌బాబు దగ్గరుండి చూశారు. సినిమా దర్శకుడు వీరు పోట్ల రాఘవేంద్రరావు పక్కనే ఉంటూ గమనించారు. నిన్నటి (గురువారం)తో సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.

మంచు విష్ణు హీరోగా బిందాస్‌, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 11న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. ఈనెల 28న పాటల్ని వినిపిస్తారు.

విష్ణు మాట్లాడుతూ ''ఢీ, దేనికైనా రెడీ తరవాత నా కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. వినోదం, యాక్షన్‌లు కలగలిపిన ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సాంకేతికంగానూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. మణిశర్మ బాణీలు అదనపు బలం'' అన్నారు.

దర్శుకుడు మాట్లాడుతూ... ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.

బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, పంకజ్‌ త్రిపాఠీ, రఘుబాబు, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సమర్పణ: ఆరియానా, వివియానా.

English summary
Director Raghavendra Rao has filmed couple of scenes with Lakshmi Prasanna for the film Doosukeltha. She is playing a cameo in this film. Doosukeltha stars Vishu Manchu in the lead and is produced by Mohan Babu. The film is actually directed by Veeru Potla. 
 This shoot on Lakshmi Prasanna took place today at the Gandarva Mahal sets in Hyderabad. The film is likely to release on the 11th of October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu