»   » వెంకటేష్, సునీల్‌తో దర్శకేంద్రుడి భక్తిరస చిత్రం!

వెంకటేష్, సునీల్‌తో దర్శకేంద్రుడి భక్తిరస చిత్రం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో భక్తిరస చిత్రాలు, ఆధ్యాత్మిక చిత్రాలు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, శిరిడీ సాయి, ఓం నమోవెంకటేశాయ లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాఘవేంద్రరావు మరో భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఇందులో టాలీవుడ్ అగ్ర నటుడు వెంకటేష్‌తో పాటు సునీల్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Raghavendra Rao's devotional movie with Venkatesh and Sunil

రాఘవేంద్రరావు ఒక సినిమా చేయడం లేదని, ఇద్దరితో వేరేర్వురుగా రెండు భక్తి రస చిత్రాలు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం దర్శకేంద్రుడు స్క్రిప్టు వర్క్ మీద బిజీగా ఉన్నారని, స్క్రిప్టు వర్క్ పూర్తయిన తర్వాత ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. అయితే ఈ సినిమా నేపథ్యం ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వెంకటేష్, సునీల్ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. వెంకీ తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ ముందుక వెళుతున్నారు. కమడియన్ నుండి హీగా టర్న్ అయిన సునీల్ త్వరలో మళ్లీ కమెడియన్‌గా ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

English summary
The sources close to K Raghavendra Rao say that the director has planned to make two devotional movies, one with Venkatesh Daggubati and other with Comedian turned actor Sunil. The script work for both upcoming devotional movies are going on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu