»   » కె. రాఘవేంద్రరావు గారి హార్ట్ టచింగ్ ట్వీట్

కె. రాఘవేంద్రరావు గారి హార్ట్ టచింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారుకీ, నిన్న స్వర్గస్తులైన విన్సెంట్ గారికీ ఉన్న అనుబంధం తెలియంది కాదు.. ఈ నేపధ్యంలో విన్సెంట్ గారి గురించి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు. ''జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అంత అందంగా రావడానికి ముఖ్యకారణం విన్సెంట్‌గారు. ప్రతీ ఫ్రేమ్‌నీ ఓ పెయింటింగ్‌లా ఆయన చిత్రీకరించారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే 'అందాలతో అహో మహోదయం...' పాటలో పాలిథిన్‌ కవర్లను ఉపయోగించి మంచు కొండల్లాగా కనిపించేలా చేసిన ఆయన ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. అలాంటి ఓ గొప్ప సాంకేతిక నిపుణుడు దూరం కావడం బాధగా ఉంది'' అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'సోగ్గాడు', 'జ్యోతి', 'అడవి రాముడు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అల్లుడుగారు', 'ఘరానా మొగుడు', 'అల్లరి ప్రియుడు', 'మేజర్‌ చంద్రకాంత్‌', 'సాహసవీరుడు సాగరకన్య' తదితర చిత్రాలకు విన్సెంట్‌ ఛాయాగ్రహకుడిగా పనిచేశారు.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్‌.గోపాల్‌రెడ్డి గారు స్పందిస్తూ... ''ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ పరిశ్రమకు ఆదర్శంగా నిలిచేవారు విన్సెంట్‌గారు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఇష్టమైన ఛాయాగ్రాహకుడు. 'గోవిందా గోవిందా' సినిమాలో విశ్వరూపం సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని తీసేందుకు విన్సెంట్‌గారే ఉత్తమం అని ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించాం. అద్భుతంగా తీశారాయన.

Raghavendra Rao's heart touching tweet

'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రీకరణలో ప్రదర్శించిన మేజిక్‌ నన్ను బాగా ఆకట్టుకొంది. విన్సెంట్‌గారు చేసిన చిత్రాల్లో 'అన్నమయ్య' అన్నా నాకు అంతే ఇష్టం. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఓ గొప్ప సాంకేతిక నిపుణుడాయన. తనయులిద్దరినీ ఛాయాగ్రహకుల్ని చేశారు. వాళ్లు కూడా తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు తెచ్చుకొంటున్నారు'' అని చెప్పుకొచ్చారు.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు విన్సెంట్‌ (87) కన్నుమూశారు. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాలకు పని చేశారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విన్సెంట్‌కు భార్య మాగ్రెన్ట్‌, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతికి సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తంచేసింది.

డిజిటల్‌ హంగులు లేని కాలంలోనూ తన కెమెరాతో మాయ చేసిన ఛాయా గ్రాహకుడు ఎ.విన్సెంట్‌. నేటి గ్రాఫిక్స్‌ను తలదన్నేలా అప్పట్లోనే కెమెరాతో మాయాజాలాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల్ని అబ్బురపరిచారు. పరిశ్రమలో పాత, కొత్త తరాలకు మధ్య వారధిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. అలనాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ మొదలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, మోహన్‌బాబు తదితరుల చిత్రాలకు పనిచేశారు. తెలుగులో 'బ్రతుకు తెరువు', 'సొంత వూరు', 'ఇల్లరికం', 'పెళ్లి కానుక', 'కుల గోత్రాలు', 'లేత మనసులు', 'భక్తప్రహ్లాద' లాంటి ఎన్నో హిట్‌ చిత్రాలకు పనిచేశారు. 'బాబు' సినిమా కోసం తొలిసారి కె.రాఘవేంద్రరావుతో కలసి పనిచేశారు. అప్పట్నుంచి 'అన్నమయ్య' వరకు వీరిద్దరి కలయికలో అనేక చిత్రాలు తెరకెక్కాయి.

కె.విశ్వనాథ్‌, కోదండరామిరెడ్డిలాంటి దర్శకుల చిత్రాలకూ ఆయన కెమెరా బాధ్యతల్ని నిర్వహించారు. తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన 'అడవి రాముడు' చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా తొలి నంది అవార్డును అందుకున్నారు. నాగార్జున నటించిన 'అన్నమయ్య'కూ నందిని సొంతం చేసుకున్నారు. విన్సెంట్‌ ఇక లేరన్న విషయం తెలియగానే భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప సాంకేతిక నిపుడుణ్ని కోల్పోయిందని పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

కేరళలోని కాలికట్‌ ప్రాంతానికి చెందిన అనెస్టినా- జార్జ్‌ దంపతులకు 1928 జూన్‌ 14న విన్సెంట్‌ జన్మించారు. పూర్తిపేరు అజయ్‌ విన్సెంట్‌. అక్కడి కళాశాలలో చదువు పూర్తి చేసిన ఆయన 1950 దశకంలో సినీ రంగంపై మక్కువతో మద్రాసుకు పయనమయ్యారు. ఛాయాగ్రాహకుడుగా తెలుగు చిత్రం 'చండీరాణి'తో తన కెరీర్‌ ప్రారంభించారు. మలయాళంలో కెమెరామన్‌గా ఆయన తొలి చిత్రం 'నీలకుయిల్‌'. మలయాళంలో ఆయన దర్శకత్వం వహించిన 'తులాభారం' అవార్డుల వర్షం కురిపించింది.

జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. జయలలిత కీలకపాత్రలో రూపొందిన 'తిరుమాంగళ్యం' చిత్రానికి కూడా విన్సెంట్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో ఎంజీఆర్‌ నటించిన 'ఎంగవీట్టుపిళ్త్లె' మొదలుకొని శివాజీ గణేశన్‌, రజనీకాంత్‌ వంటి పెద్ద హీరోల సినిమాలకూ ఆయన పనిచేశారు. అమితాబ్‌ హిందీలో నటించిన 'మహాన్‌', రాజేష్‌ఖన్నా నటించిన 'బాందిష్‌' సినిమాలకూ ఆయన పనిచేశారు. 1985లో మలయాళంలో వచ్చిన త్రీడీ చిత్రం 'పౌర్ణమి రావిల్‌'కు దర్శకత్వం వహించారు.

English summary
K Raghavendra rao who shares a great rapport with A. Vincent, working for so many of his films was deeply saddened with his death and the director expressed his condolences to the family.KRR Tweeted : "RIP A. Vincent garu. We both have worked for many movies. Very sad to hear about his demise. Extremely talented and good at heart.."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu