Just In
- 40 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడాకులు తీసుకున్న రాఘవేంద్రరావు కొడుకు, కోడలు.. ఏం జరిగిందంటే?
కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'జడ్జిమెంటల్ హై క్యా' మూవీ ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. కనికా థిల్లా కథ అందించారు. ప్రకాష్-కనికా 2014లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు మీడియాలో 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాకు సంబంధించిన న్యూస్ రాసినప్పుడల్లా చాలా మంది ఇది రాఘవేంద్రరావు కొడుకు, కోడలు కలిసి చేస్తున్న సినిమా, భార్య భర్తలు కలిసి విభిన్నమైన సినిమా చేస్తున్నారు అని రాసేవారు. అయితే తాజాగా ఓ షాకింగ్ నిజం బయట పడింది. ఈ ఇద్దరూ విడిపోయి చాలా కాలం అయిందట.

రెండేళ్ల క్రితమే విడిపోయారట
తాజాగా ఓ బాలీవుడ్ ఎంటర్టెన్మెంట్ వెబ్ సైట్ వెల్లడించిన కథనం ప్రకారం... రెండేళ్లక్రితమే ఇద్దరి వైవాహిక బంధం బీటలువారిందట. ఏక్తా కపూర్ నిర్మాణంలో ‘జడ్జిమెంటల్ హై క్యా' సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఇది జరిగింది.

వారే స్వయంగా వెల్లడించారు
‘అవును.. మేము విడిపోయాం. అయితే జడ్జిమెంటల్ హై క్యా సినిమా సమయంలో కాదు, రెండేళ్ల క్రితమే ఆ మూవీ షూటింగ్ మొదలవ్వడానకి ముందే ఇది జరిగింది.' అంటూ ఈ మాజీ దంపతులు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రకాష్ కోవెలమూడి తాము విడిపోవడానికి గల కారణం ఏమిటో వెల్లడించే ప్రయత్నం చేసినప్పటికీ... కనికా థిల్లాన్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు.

విడాకులపై ప్రకాష్ కోవెలమూడి స్పందిస్తూ...
‘‘మేము హైదరాబాద్‌లో సెటిలయ్యాం.. నా సోషల్ సర్కిల్ అంతా అక్కడే ఉంది, కానీ ఆమె రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్ అయ్యారు.'' అని ప్రకాష్ వెల్లడించారు. ‘‘మేము ఎందుకు విడిపోయాం అనేది ముఖ్యం కాదు, ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నాం. ఇద్దరి అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని కనికా తెలిపారు.

ఇద్దరం కలిసి పని చేస్తాం
భవిష్యత్తులో కూడా మీరు కలిసి పని చేస్తారా? అనే ప్రశ్నకు ప్రకాష్ కోవెలమూడి స్పందిస్తూ... ‘‘ఎందుకు పని చేయం? చేస్తాం. మేము విడిపోయిన తర్వాతే జడ్జిమెంటల్ హై క్యా సినిమా చేశాం. ఇద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలకు కలిసి పని చేస్తాం.'' అన్నారు.