»   » రాఘవేంద్రరావు లక్కీ మేన్ అంటున్న నాగార్జున (ఫోటోస్)

రాఘవేంద్రరావు లక్కీ మేన్ అంటున్న నాగార్జున (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమలి తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పదవికి సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు శ్రీవారి సన్నిధిలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి కూడా పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదసిర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డా. సిహెచ్.కృష్ణ మూర్తి, టీటీడీ ఈఓ డా. డి సాంబశివరావు దర్శకేంద్రుడికి శ్రీవారి లడ్డూ ప్రసాదం, శ్రీవారి ల్యామినేషన్ ఫోటో బహూకరించారు.

అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ....తనకు ఈ పదవి దక్కడంపై ఆనందం వ్యక్తం చేసారు. శ్రీవారికి, శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు సేవ చేసే భాగ్యం లభించడం సంతోషంగా ఉందన్నారు.

మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ ఆ వేంకటేశ్వర స్వామి టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తానంటే ఎందుకు కాదంటాను, తప్పకుండా స్వీకరిస్తా అన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసాలు కలిగిన రాఘవేంద్రరావుకు టీటీడీ ధర్మకర్తల మండలిలో మరోసారి అవకాశం రావటం అదృష్టమన్నారు. నాగార్జునను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఓ మహిళ ఆయన చేయి పట్టుకుని ముద్దాడింది.

స్లైడ్ షోలో ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఫోటోలు.

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం


తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న రాఘవేంద్రరావు.

దర్శనం

దర్శనం


ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకున్నారు.

లడ్డూ, పటం బహూకరణ

లడ్డూ, పటం బహూకరణ


ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం లడ్డూ ప్రసాదం, శ్రీవారి పటం బహూకరించారు.

గ్రూఫ్ ఫోటో

గ్రూఫ్ ఫోటో


టీటీడీ చైర్మ, ఈవో, నాగార్జున, కీరవాణిలతో కలిసి రాఘవేంద్రరావు గ్రూఫ్ ఫోటో

మీడియా ముందు

మీడియా ముందు


ప్రమాణ స్వీకరం అనంతరం మీడియా ముందు ఇలా....

కార్యాలయంలో..

కార్యాలయంలో..


ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ ట్రస్టు బోర్డు కార్యాలయంలో రాఘవేంద్రరావు

English summary
Raghavendra Rao sworn in as TTD Trust Board member in Srivari temple on Wednesday by 9:30am.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu