»   » గుండు చేయించుకున్నరాఘవేంద్రరావు

గుండు చేయించుకున్నరాఘవేంద్రరావు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమలి తిరుపతి దేవస్థానం కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తల నీలాలు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్నమయ్య సినిమా తెరకెక్కించినందుకు ఆ ఏడు కొండల వాడే తనకు బహుమతిగా తనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమించారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని ద్వారా తనకు ఆ ఏడు కొండల వాడికి మరింత సేవ చేసే బాగ్యం దక్కిందని భావిస్తున్నట్లు తెలిపారు.

Raghavendra Rao tonsures head photo

రాఘ వేంద్రరావు తెలుగు సినిమా పరిశ్రమలో రక్తిరస చిత్రాలతో పాటు...భక్తి రస చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చి అన్నమయ్య, శ్రీరామదాసు, పాండు రంగడు, షిరిడి సాయి బాబా లాంటి భక్తిరస చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.

English summary
K Raghavendra Rao was chosen one of the members of the secretarial body of Tirumala Tirupathi Devasthanam( TTD). The director visited Tirumala to offer prayers to god and he appeared with tonsured head.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu