టాలీవుడ్ లీడింగ్ కమెడియన్ సంచలన నిర్ణయం.. పట్టించుకోవడం లేదంటూ పోస్ట్
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా రాహుల్ రామకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుకోకుండా సినిమా ఎంట్రీ ఇచ్చిన ఆయన కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే లీడ్ రోల్ లో కూడా ఒక వెబ్ మూవీలో నటించాడు. అయితే తాజాగా సినిమాలకు గుడ్ బై చెబుతున్నాను అంటూ ఆయన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. అసలు ఆయన ఎందుకు గుడ్ బై చెప్పనున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

అర్జున్ రెడ్డి క్రేజ్
సైన్మా అని తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన షార్ట్ ఫిలింతరాహుల్ రామకృష్ణ కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో యాదగిరి అనే పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాలో చిన్న పాత్ర చేశాడు. వీటన్నిటికీ పెద్దగా పేరు రాలేదు కానీ ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడు పాత్రలో నటించారు.

హీరోగా
అర్జున్ రెడ్డి సినిమాతో రాహుల్ రామకృష్ణకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమా దెబ్బతో రాహుల్ రామకృష్ణ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పని పడలేదు. వరుసగా భరత్ అనే నేను, ఇంటెలిజెంట్, సమ్మోహనం, హుషారు, మిఠాయి, వంటి చాలా సినిమాలలో ఆయన నటించడమే కాక సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాలో కూడా భాగమయ్యాడు. అలాగే ఆయన హీరోగా నటించిన వెబ్ మూవీ 'నెట్' కూడా జీ ఫైవ్ లో విడుదలైంది.

కీలక నిర్ణయం
అలాగే ఇటీవల విడుదలైన 'స్కైలాబ్'లోనూ, తాజాగా జనం ముందుకు వచ్చిన 'గుడ్ లక్ సఖి'లోనూ రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. పలు చిత్రాల్లో కూడా ఆయన భాగమయ్యారు. ఇప్పుడు ఆయన నటించిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, విరాటపర్వం వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏమైందో ఏమో కానీ రాహుల్ రామకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు.

రకరకాల ట్వీట్లు
2022 తర్వాత ఇక సినిమాల్లో నటించనని ట్వీట్ చేశారు. 'ఈ యేడాదే చివరిది. ఇకపై సినిమాలు చేయను. నేను పట్టించుకోవడం లేదు, మీరూ పట్టించుకోకండి' అంటూ ఆయన చేసిన ట్వీట్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో నెట్ సినిమా విడుదల సమయంలో కూడా ఇలానే రాహుల్ రామకృష్ణ రకరకాల ట్వీట్లు పెట్టారు.

పలు రకాలుగా
అయితే గత అనుభవాల దృష్ట్యా రాహుల్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాంక్ చేస్తున్నావా ? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ ఆ మధ్య మందు తాగుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందు తాగి ఇవి పోస్ట్ చేశావా ? ;లేక నిజంగానే సినిమాలు మానేస్తున్నావా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ అంశం మీద రాహుల్ ఇంకేమి స్పందిస్తారో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











