»   » అసిన్‌కు హనీమూన్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన భర్త!

అసిన్‌కు హనీమూన్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన భర్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అసిన్ వివాహం బిజినెస్ మేన్ రాహుల్ శర్మతో జనవరి 19న గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నవదంపతులు హనీమూన్ ట్రిప్పుకు వెళ్లారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన డార్లింగ్ వైఫుకు హనీమూన్ సందర్భంగా స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసాడట రాహుల్ శర్మ.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ జంట తొలుత హార్వర్డ్ బోస్టన్ వెళ్లాల్సి ఉంది. కానీ అసిన్ ను సర్‌ప్రైజ్ చేయడానికి ఆమెకు ముందుగా చెప్పని లొకేషన్లకు తీసుకెళ్లాడట. వాస్తవానికి అసిన్-రాహుల్ హనీమూన్ ట్రిప్ మొదటి స్టాప్ హార్వర్డ్... కానీ భార్యను సర్ ప్రైజ్ చేయడానికి ప్లాన్ మార్చాడు రాహుల్.

ఈ జంట వివాహం కూడా డిఫరెంట్ స్టైలో జరిగింది. అసిన్ క్రిస్టియన్ కావడం, రాహుల్ హిందూ కావడంతో ఇద్దరి మత సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. జనవరి 19వ తేదీ ఉదయం చర్చి వెడ్డింగ్ జరిగింది. సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ రెండు పెళ్లిళ్లు ఢిల్లీలోనే జరిగాయి.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.... రాహుల్-అసిన్ ప్రేమ వ్యవహారం వెనక మన్మధుడి పాత్ర పోషించిన వ్యక్తి అక్షయ్ కుమార్. అసలు అక్షయ్ కుమార్ లేకుంటే ఈ ఇద్దరూ ఒక్కటయ్యే వారే కాదు. రాహుల్ శర్మ అక్షయ్ కుమార్ ఫ్రెండ్ కావడం, అక్షయ్ సినిమాలో అసిన్ నటించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది.

స్లైడ్ షోలో రాహుల్-అసిన్ వివాహానికి సంబంధించిన అరుదైన ఫోటోస్...

రాహుల్-అసిన్

రాహుల్-అసిన్

తొలిసారిగా రాహుల్ శర్మ-అసిన్ ‘హౌస్ ఫుల్-2' షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. పక్కన కనిపిస్తున్న ఫోటో అసిన్-రాహుల్ వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించినది.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

అసిన్ ను రాహుల్ శర్మకు తొలుత పరిచయం చేసిన వ్యక్తి అక్షయ్ కుమార్. పక్కన కనిపిస్తున్నది రాహుల్ శర్మ పెళ్లి వేడుక ఫోటో.

అసిన్-రాహుల్

అసిన్-రాహుల్

వివాహం చేసుకోవడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు అసిన్-రాహుల్ శర్మ డేటింగ్ చేసారు. పక్కన కనిపిస్తున్నది అసిన్-రాహుల్ పెళ్లి తర్వాతి ఫోటో.

వెడ్డింగ్

వెడ్డింగ్

అసిన్-రాహుల్ వివాహం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంలా జరిగింది.

అసిన్-అక్షయ్-రాహుల్

అసిన్-అక్షయ్-రాహుల్

కొత్త దంపతులు రాహుల్-అసిన్ లతో కలిసి అక్షయ్ కుమార్.

అసిన్

అసిన్

పెళ్లి వేడుకలో తన స్నేహితులతో కలిసి అసిన్

వెడ్డింగ్ పిక్

వెడ్డింగ్ పిక్

అసిన్, రాహుల్ శర్మల వివాహం నాటి ఫోటో....

చర్చి వెడ్డింగ్

చర్చి వెడ్డింగ్

రాహుల్-అసిన్ లకు సంబంధించిన చర్చి వెడ్డింగ్ ఫోటో...

రిసెప్షన్

రిసెప్షన్

అసిన్-రాహుల్ శర్మల వెడ్డింగ్ రిసెప్షన్ ముంబైలో జరిగింది.

హనీమూన్

హనీమూన్

ప్రస్తుతం రాహుల్ శర్మ, అసిన్ హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

English summary
Asin and Rahul Sharma got married on January 19th in a private ceremony. Now, the couple has left for their honeymoon and according to recent reports, Rahul Sharma has special surprise for his darling wife Asin.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu