లక్ష్మీ రాయ్ హాట్ ఇన్నింగ్స్ మొదలైంది (ఫోటో)
హైదరాబాద్: అప్పట్లో బాలీవుడ్‌లో వచ్చిన ‘జూలీ' సినిమా గుర్తుందా?...ఈ సినిమా ద్వారా పాపులరైన హాట్ బ్యూటీ నేహా దుపియా. ఈ చిత్రంలో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జూలీ 2' రాబోతోంది. అయితే ఈ సినిమాలో నేహా దూపియా నటించడం లేదు. దీంతో ఈ అవకాశం సౌతిండియా హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్‌కి దక్కింది.
తాజాగా ఈ సినిమా ప్రారంభం అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోను లక్ష్మీ రాయ్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేసింది. లక్ష్మీ రాయ్ కెరీర్లో ఇది సరికొత్త ఇన్నింగ్స్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోంది లక్ష్మీ రాయ్.
బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి చిత్రం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

‘జూలీ 2' చిత్రానికి కూడా దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహించబోతున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట.
ఈ సంవత్సరం లక్ష్మీ రాయ్ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. ఈ అమ్మడు ఈ సంవత్సరం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











