»   » మూడో యేట నుంచే మహేష్‌ అభిమానిని

మూడో యేట నుంచే మహేష్‌ అభిమానిని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "మూడో యేట నుంచే హీరో మహేష్‌బాబు అభిమానిని. నా మూడో యేట నాన్నగారు 'ఒక్కడు'కి సినిమాకి తీసుకెళ్లారు. సినిమా గురించీ తెలిసిందీ, ఇష్టం కలిగిందీ 'ఒక్కడు' చూశాకే. ఆసినిమాతో మహేష్‌ ఫ్యాన్‌ అయిపోయా." అంటున్నారు రాజ్ తరుణ్. రాజ్‌ తరుణ్‌ నటించిన రెండో చిత్రమిది. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే... ఓసారి నానక్‌రామ్‌గుడ రామానాయుడు స్టూడియోలో 'శ్రీమంతుడు' షూటింగులో మహేష్‌ని కలిశా. ఆ సమయంలో ఆయన్నలా చూస్తూనే ఉన్నాగానీ మాట్లాడలేకపోయా. మహేష్‌గారే ఉయ్యాలా జంపాలాలో బాగా చేశావని నన్ను అభినందిస్తూ పలకరించారు. మహేష్‌ తరవాత అంతగా ఇష్టపడింది సునీల్‌గారిని. డాన్సులు, ఫైట్స్‌ విషయంలో ఆయనలా కష్టపడాలి అని చెప్పుకొచ్చారు.

Raj Tajun said that he is Mahesh Fan

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ రోజు విడుదల అవుతున్న 'సినిమా చూపిస్త మావ' గురించి మాట్లాడుతూ.... మావా అల్లుళ్ల సంఘర్షణ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఆద్యంతం నవ్వించేలా దర్శకుడు త్రినాధరావు నక్కిన మలిచారు. శేఖర్‌చంద్ర సంగీతం, ప్రసన్నకుమార్‌ సంభాషణలు, రావు రమేష్‌గారి నటన ఇవన్నీ ఈ సినిమాకి ప్రధాన బలం అన్నారు.

ముఖ్యంగా.... 'పిల్లికళ్ల పాపా నేనంటే చిన్నచూపా' అనే పాట నా ఫేవరేట్‌. ఇదే నా సెల్‌ఫోన్‌ రింగ్‌టోన్‌. అవికాతో చేస్తున్న రెండో సినిమా ఇది. ఇదీ మంచి విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది అని వివరించారు.

రెండో సినిమాకీ అవికానే ఎంచుకోవటం గురించి చెప్తూ... తొలి సినిమాతో మా కెమిస్ట్రీ ప్రేక్షకులకి నచ్చింది. మాకు ఒకరిపై ఒకరికి స్నేహం, గౌరవం, పని పట్ల నిబద్దత, తపన ఉన్నాయి. వయసులో తను నాకన్నా చిన్నదయినా నటనలో పెద్దది. సీరియల్స్‌ నటించిన అనుభవం తనకుంది. నటన విషయంలో తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. తనతో సరిపడే కథలు వస్తే మళ్లీ మళ్లీ చేస్తా. చేయడంలో తప్పేం లేదు అని అన్నారు.

English summary
Tollywood Hero Raj Tarun said that he is Mahesh Babu's Fan from his child hood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu