Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నా మొదటి సినిమా దగ్గరి నుంచి గృహప్రవేశం వరకు.. అవికా గోర్‌పై రాజ్ తరుణ్ కామెంట్స్
ఉయ్యాల జంపాల సినిమాతో కొత్త జంటగా రాజ్ తరుణ్, అవికా గోర్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బుల్లితెరపై అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలా అక్కడ గ్యాప్ ఇచ్చిన అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో మళ్లీ వెండితెరపై మెరిసింది. తెలుగులో చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో అవికాకు మంచి ఆఫర్లు వచ్చాయి.

హిట్ పెయిర్‌గా..
అయితే ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్, అవికా గోర్‌లు ఇద్దరూ కూడా మ్యాజిక్ చేసేశారు. మొదటి సినిమాతో మంచి కెమిస్ట్రీ కుదిరి క్యూట్ జంటగా క్రేజ్ దక్కించుకున్నారు. అందుకే మళ్లీ వెంటనే మరో చిత్రం కూడా వచ్చింది. సినిమా చూపిస్త మామ అంటూ వచ్చిన ఆ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు..
అలా మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. అవికా గోర్, రాజ్ తరుణ్‌లు ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఎంతో సరదాగా ఉంటారు. మంచి స్నేహితుల్లా కలిసి ఉంటారు. వీకెండ్‌లో పార్టీలు కూడా చేసుకుంటూ రచ్చ చేస్తుంటారు. మధ్యలో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్లు కూడా వచ్చాయి.

ఆ ప్రకటనలతో క్లారిటీ..
అయితే రాజ్ తరుణ్ తనకు ఓ ప్రేయసి ఉందని, టైం వచ్చినప్పుడు చెబుతానని తెలిపాడు. ఇక అవికా గోర్ అయితే ఏకంగా తనకు కాబోయే వాడిని పరిచయంచేస్తూ అసలు గుట్టు విప్పింది. తన ఫియాన్సీ మీద పెద్ద కవితనే రాస్తూ అసలు విషయం చెప్పేసింది. అలా రాజ్ తరుణ్, అవికాల మధ్య కేవలం స్నేహమే ఉందని తెలిసి వచ్చింది.

కొత్తింట్లోకి యువ హీరో..
రాజ్ తరుణ్‌కు ఇప్పుడు సినిమాలేవీ లేకపోయినా.. ఒక్క హిట్ రాకపోయినా కూడా కొత్తింటిని కొన్నాడు. తాజాగా గృహ ప్రవేశం కూడా చేశాడు. అట్ట హాసంగా జరిపించుకుండా ఏదో సింపుల్‌గా కానిచ్చేశాడు. మొత్తానికి ఈ గృహ ప్రవేశం ఈవెంట్‌లో అవికాయే మెయిన్ హైలెట్ అయింది.

మొదటి నుంచి..
తన కొత్తింట్లో అవికా గోర్ ఉండటంపై రాజ్ తరుణ్ ఎమోషనల్ అయ్యాడు. నా మొదటి సినిమా నుంచి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నాతో ఉన్నావ్ అంటూ అవికా గురించి రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. దీనికి అవికా స్పందిస్తూ.. అమీ తుమాకీ బాలు బాషీ (బెంగాల్‌లో ఐ లవ్యూ) అని చెప్పేసింది. హ్యాపీ టియర్స్ అంటూ మరో కామెంట్ పెట్టేసింది.