For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్‌ తరుణ్ యాక్సిడెంట్ కేసులో ఊహించని మలుపు.. అతడిపైనే అనుమానాలు!

|

మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక, బుధవారం ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించిన విషయం తెలిసిందే.

పారిపోవడంపై వివరణ

పారిపోవడంపై వివరణ

యాక్సిడెంట్ తర్వాత పారిపోవడంపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు. ‘నేను క్షేమంగానే ఉన్నాను. నాకోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి కిందికి దిగాను. కారును చూశాను. నాకేమైనా గాయాలయ్యాయేమోనని చూసుకున్నాను. ఆ వెంటనే ఎవరి సహాయమైనా తీసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి వేగంగా పారిపోయాను. ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగింది అంతా ఇదే' అని అతడు చెప్పుకొచ్చాడు.

 గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా

గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా

గురువారం ఇదే విషయంపై మాట్లాడడానికి రాజ్ తరుణ్ ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ‘ప్రమాదం జరిగినప్పుడు మద్యం సేవించి ఉన్నారా' అని చాలా మంది అతడిని ప్రశ్నించారు. అందులో ఒకరికి నో అని సమాధానం ఇచ్చాడు. మధ్యలో మరో నెటిజన్ ‘డ్రింక్ చేస్తే మాత్రం చేసాం అని చెప్తారా ఏంటి' అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి ‘యాక్సిడెంట్ అయ్యి బాధ పడితే.. గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా' అంటూ రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.

ప్రత్యక్ష సాక్షి ఎంట్రీతో కొత్త ట్విస్ట్

ప్రత్యక్ష సాక్షి ఎంట్రీతో కొత్త ట్విస్ట్

రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్తీక్ అనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అంతేకాదు రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు కార్తీక్. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ను స్వయంగా ఇంటి దగ్గర దించానని చెప్పాడు. అంతేకాదు, అప్పుడు తనకు రాజ్ తరుణ్ పర్సనల్ నంబర్ కూడా ఇచ్చాడని వెల్లడించాడు.

 డబ్బులు ఇస్తానన్నారు

డబ్బులు ఇస్తానన్నారు

తర్వాతి రోజు రాజ్ తరుణ్ తనకు ఫోన్ చేసి వీడియోలు డిలీట్ చేయమని బ్రతిమాలాడని కార్తీక్ తెలిపాడు. అంతేకాదు, ఈ విషయమై తన మేనేజర్ నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతాడని చెప్పాడన్నాడు. తర్వాత ఆయన ఫోన్ చేసి ‘మీకు ఎంత కావాలి..? అవసరమైతే ఐదు లక్షలు ఇస్తాం ఆ వీడియోలు డిలీట్ చేయండి' అని చెప్పాడని ఓ కాల్ రికార్డును బయటపెట్టాడు. అయితే, అందులో రాజా రవీంద్ర బేరాలు ఏమీ మాట్లాడలేదు. నా అసిస్టెంట్ వస్తాడు అని మాత్రం చెప్పడం వినిపించింది.

 మహిళ తిడుతున్న ఆడియోతో అనుమానాలు

మహిళ తిడుతున్న ఆడియోతో అనుమానాలు

ఆ తర్వాత ఏం జరిగిందో ఆధారాలు చూపని కార్తీక్.. ఓ మహిళ ఫోన్ చేసి బెదిరించిందని మాత్రం ఓ ఆడియోను బయట పెట్టాడు. అందులో మాట్లాడిన మహిళ కార్తీక్‌ను నిజంగానే తిట్టింది. అదే సమయంలో ‘ఇలా బెదిరింపులకు పాల్పడడం ఎంత వరకు కరెక్ట్' అని నిలదీసింది. అంతేకాదు, ‘ఆ స్థానంలో మీ తల్లిదండ్రులు ఉంటే.. ఎవరైనా ఇలాగే బెదిరిస్తే ఏం చేస్తావ్.? డబ్బులు కావాలని బెదిరిస్తున్నావ్ సిగ్గులేదా..?' అంటూ తిట్టింది. దీంతో కార్తీకే డబ్బులు కావాలని బెదిరించాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రాజా రవీంద్ర ఎంట్రీ.. ఇరుక్కున్న కార్తీక్

రాజా రవీంద్ర ఎంట్రీ.. ఇరుక్కున్న కార్తీక్

ఈ కేసు గురువారం సాయంత్రం కొత్త మలుపు తిరిగింది. యాక్సిడెంట్‌ వీడియోలు మీడియాకు ఇస్తానని డిజైనర్‌ కార్తీక్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడని రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ రాజా రవీంద్ర గురు వారం మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న కార్తీక్‌ అనే వ్యక్తి తనకు కాల్‌ చేసి రాజ్‌ తరుణ్‌కు సంబంధించిన ఒక వీడియో తన వద్ద ఉందని చెప్పాడని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Raj Tarun has acted in 52 short films, and dreamt of becoming a film director. He also worked on the screenplay and dialogues for his first film Uyyala Jampala. In 2015, he acted in Cinema Choopistha Mava and Kumari 21F.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more