»   » రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ కాంబినేషన్లో మరో మూవీ!

రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ కాంబినేషన్లో మరో మూవీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘కుమారి 21ఎఫ్' మూవీలో జంటగా నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తెరపై తమ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. గతంలో ‘దేనికైనా రెడీ' సినిమాకు దర్శకత్వం వహించిన జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ‘కుమారి 21 ఎఫ్' చిత్రంలో హెబ్బా పటేల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన దర్శక నిర్మాతలు ఈ సినిమాలో ఆమెకు చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Raj Tarun, Hebah Patel romance again

ఇక మంచు విష్ణు సరసన నటించే హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పంజాబిలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగేశ్వర రెడ్డి సుశాంత్ తో ‘ఆటాడుకుందాం రా', మంచు విష్ణుతో ‘సరదా' చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తి కాగానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

‘కమారి 21 ఎఫ్' తర్వాత రాజ్ తరుణ్ రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో ఓ సినిమా, వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ రీమేక్, మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయియ్యాడు. రాజ్ తరుణ్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడు అంటున్నారు విశ్లేషకులు.

English summary
Kumari 21F Hebah Patel actress is once again roped in to romance Raj Tarun in a new movie directed by G Nageswara Reddy of Dhenikaina Ready fame.
Please Wait while comments are loading...