»   » యాంకర్ లాస్యతో పెళ్లి వార్తలపై స్పందించిన రాజ్ తరుణ్

యాంకర్ లాస్యతో పెళ్లి వార్తలపై స్పందించిన రాజ్ తరుణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ సినిమా హీరోలు, హీరోయిన్స్ , సెలబ్రెటీలపై రూమర్స్ కామన్. అయితే అవి ఒక్కోసారి వారి పర్శనల్ లైఫ్ ని ఇబ్బంది పెట్టే లాగ ఉంటే వెంటనే వాటిని ఖండించే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా వరస హిట్స్ తో దూసుకుపోతున్న రాజ్ తరణ్ తన వివాహంపై వచ్చిన రూమర్స్ ని ఖండించే ప్రయత్నం చేసారు.

వివరాల్లోకి వెళితే...రీసెంట్ గా యంగ్ హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యను పెళ్లాడినట్టుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో , వెబ్ మీడియాలో బారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్ లో వెటకారంగా స్పందించాడు. తన ఫ్యాన్స్ కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై సెటైర్స్ వేశాడు. వాటిని పేస్ బుక్ లో షేర్ చేసిన పొస్ట్ లో చూడవచ్చు.

'కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్ లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు.

అలాగే.. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానన్నాడు. రూమార్స్ అయినా.., నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్ అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నవారికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు.

రాజతరుణ్ తాజా చిత్రాల విషయానికి వస్తే.. డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన సినిమా కుమారి 21ఎఫ్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిమందే. ఈ సినిమా విజయం తో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు సుకుమార్, రాజ్ తరుణ్.

కుమారి 21ఎఫ్ సినిమా నిర్మాణంతో పాటు కథా కథనాలను కూడా అందించిన సుకుమార్ మరోసారి రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథను రెడీ చేశారని వినపడుతోంది.

అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ చరణ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్, ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను 14 రీల్స్ సంస్థకు అప్పగించాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే సుకుమార్ కథతో రాజ్ తరుణ్ హీరోగా 14 రీల్స్ సంస్థ సినిమాను మొదలుపెట్టనుంది. ఈ సినిమా దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

English summary
Raj Tarun, who is basking in the success of Eedo Rakam Aado Rakam, has refuted the rumours about his marriage with TV anchor Laasya in his sarcastic way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu