»   » హ్యాట్రిక్ కొడితే ఇక తిరుగులేదు

హ్యాట్రిక్ కొడితే ఇక తిరుగులేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ' చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' చిత్రంపై వుంది.

రాజ్ తరున్, ఆర్తన జంటగా నటిస్తున్న ఈ చిత్రంనికి డైరక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి. ఈ నెలాఖరున అంటే జనవరి 29న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ వద్దకు వెళ్ళి, క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. దీనితో అన్ని పనులు పూర్తై రిలీజ్ కు రెడీ అయినట్లైంది. వరుస హిట్స్ తో వున్న రాజ్ తరున్ కి ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. బిజినెస్ పనులుకూడా స్పీడ్ గా జరుగుతున్నాయని సమాచారం

Raj Tarun's Seethamma Andalu Completes Censor

నిర్మాతలు మాట్లాడుతూ... ''ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్ తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్ గా వుంటాయన్నారు. తప్పకుండా ఈ చిత్రం రాజ్ తరుణ్ సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారంలా వుంటుంది.

రాజ్ తరుణ్, అర్తన, రణదీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ,రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ-స్కీన్ ప్లే--దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

English summary
Censor Board after watching ‘Seetamma Andalu Ramayya Sitralu’ film passed it with clean U certificate. Raj Tarun, Artana's starrer ‘Seetamma Andalu Ramayya Sitralu’ directed by Srinivas Gavireddy is slated for grand release on Jan 29th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu