»   » రాజ్ తరుణ్ కొత్త చిత్రం టీజర్‌ విడుదల

రాజ్ తరుణ్ కొత్త చిత్రం టీజర్‌ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజ్‌తరుణ్‌, అర్తన జంటగా నటిస్తున్న 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు' చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ విషయాన్ని ఆదిత్య మ్యూజిక్‌ వెల్లడించింది. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడండి.


శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌. శైలేంద్ర బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపిసుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది.

Raj Tarun's Seethamma Andhalu Ramayya Sithralu Teaser

నిర్మాతలు మాట్లాడుతూ....ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రం ద్వారా అర్తన అనే నూతన హీరోయిన్‌ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీ ఖర్చుతో చిత్రీకరించాం. సినిమాలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి అని తెలిపారు.

రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్ష్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ :జేవీ, కెమెరా: విశ్వ, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

English summary
Raj Tarun and Arthana in lead roles Seethamma Andalu Ramayya Sitralu official teaser has been released by the makers and watch it here
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu