సంక్రాంతికి నలిగిపోతానని, 29న
హైదరాబాద్ : వరుస హిట్ల పై వున్న హీరో రాజ్ తరుణ్ . ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త సినిమా 'సీతమ్మ అందాలు గామయ్య సిత్రాలు'. రీసెంట్ గా షూటింగ్ ఫూర్తి చేసుకున్న ఈ సినిమాకు డైరక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి.
ఈ సినిమాకు సంబందించిన ఆడియోని ఈ నెల 10న విడుదలచేయాలని, సినిమాను జనవరి 29న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. ఈ సినిమాకు భలే భలే మగాడివోయ్ సినిమాకు పని చేసిన గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే మూడు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని, దర్శకులని, నిర్మాతలను తన వైపు తిప్పికున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇతని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరిలోనే ఉండాలి. కాకపోతే పెద్ద హీరోల మద్యలో నలిగిపోతాడని బయపడి నెలాఖరుకు వస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే లవర్ బాయ్ ముద్ర వేసుకుంటాడేమో. ఉయ్యలా జంపాలా సినిమాకు సీక్విలే తీసే యోచనలో వున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











