»   » రాజ్ తరుణ్‌ను ఇలా కూడా వాడుకుంటున్నారు

రాజ్ తరుణ్‌ను ఇలా కూడా వాడుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ హీరో రాజ్ తరుణ్ తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల' చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసాడు. తర్వాత వచ్చిన ‘సినిమా చూపిస్తా మావ' కూడా అతని హిట్టయింది. సుకుమార్ తో చేసిన మూడో సినిమా ‘కుమారి 21ఎఫ్'తో రాజ్ తరుణ్ హాట్రిక్ హిట్ కొట్టడంతో పాటు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతి నిండా అవకాశాలే. మరో రెండేళ్ల వరకు ఖాళీ లేకుండా వరుస సినిమాలో అతన్ని బుక్ చేసుకున్నారు పలువురు నిర్మాతలు. మంచు విష్ణుతో కలిసి కూడా రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ లుక్, బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు... అతని డైలాగ్ డెలివరీ తీరు కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం ప్లస్సయింది.

Raj Tharun’s voice over for Abbayitho Ammayi

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగ శౌర్య నటిస్తున్న ‘అబ్బాయితో అమ్మాయి' సినిమాకు రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ అందించినట్లు సమాచారం. జనవరి 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో రావు రమేష్, ప్రగతి, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు.

నాగశౌర్య‌, ప‌ల్ల‌క్ ల‌ల్వాని జంట‌గా మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి`. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.

English summary
Young hero Raj Tharun is on a all time high after the success of his latest film Kumari 21 F. Latest update reveals that he has given his voice over for the upcoming film Abbayitho Ammayi. Starring Naga Shourya, this film is up for release this 1st of January.
Please Wait while comments are loading...