»   » ఇపుడు మాకూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు: ఆడియో వేడుకలో చంద్రబాబు (ఫోటోస్)

ఇపుడు మాకూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు: ఆడియో వేడుకలో చంద్రబాబు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విజయవాడలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారారోహిత్, తారకరత్న, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, సాయికొర్రపాటి, ఇషా తల్వార్, భాస్కర్ సామల, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, సాయికార్తీక్, డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, కాసర్ల శ్యామ్, కారుమంచి రఘు తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆడియో సీడీలను నారాచంద్రబాబునాయుడు విడుదల చేసి తొలి సీడీని నందమూరి బాలకృష్ణకు అందించారు.

నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ' నారా రోహిత్ బాణంతో తన తొలిసినిమాను స్టార్ట్ చేసి కంటిన్యూగా దూసుకెళ్తున్నారు. ఇదివరకు మా కుటుంబానికి అనుచరులు మాత్రమే ఉండేవారు. నారా రోహిత్‌ కథానాయకుడయ్యాక అభిమానులు కూడా ఏర్పడ్డారు. తెలుగు సినిమా మార్కెట్టు రోజు రోజుకీ విస్తృమవుతుంది. మంచి సినిమాలు తీయాలి. తెలుగు సినిమాకు ఒక చరిత్ర ఉంది. హిందీ తర్వాత ఎక్కువ మార్కెట్ ఉన్న భాషా చిత్రం తెలుగు సినిమా మాత్రమే. ఇండియాలోనే ఏడాదికి తొమ్మిది నుండి పదివేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. దీన్ని ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవాలన్నారు.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాలు తీయడానికి అందమైన లోకేషన్స్ ఉన్నాయి. నేను సినిమా పరిశ్రమలో పెద్దలకు చెబుతున్నదొక్కటే ఆంధ్రప్రదేశ్ లో సినిమాల నిర్మాణానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరపున అన్న విధాల సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. అండగా నిలబడతాం, పూర్తిగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

నిర్మాత గురించి

నిర్మాత గురించి


సాయికొర్రపాటి అన్నీ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిర్మిస్తున్నారు అంటూ చంద్రబాబు ప్రశంసించారు.

తారకరత్న విలన్

తారకరత్న విలన్


తారకరత్న విలన్ గా చేయడం హ్యపీగా ఉంది. రోహిత్, తారకరత్న కాంబినేషన్ లో ఈ సినిమా రావడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు.

సినిమా రంగంతో రిలేషన్

సినిమా రంగంతో రిలేషన్


నారారోహిత్ తో మా కుటుంబానికి కూడా సినిమా రంగంతో రిలేషన్ ఏర్పడింది. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది, సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు చంద్రబాబు

నారా రోహిత్ మాట్లాడుతూ

నారా రోహిత్ మాట్లాడుతూ


క్వాలిటీ సినిమాలు చేసే వారాహిచలన చిత్రం బ్యానర్ లో ఇలాంటి ఓ మంచి సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని రోహిత్అన్నారు.

దర్శకుడి గురించి..

దర్శకుడి గురించి..


దర్శకుడు ప్రదీప్ తనకు ఏం కావాలో దాన్ని మా నుండి హండ్రెడ్ పర్సెంట్ రాబట్టుకున్నాడు. సాయికార్తీక్ తో నేను చేస్తున్న ఐదో సినిమా. మంచి సాంగ్స్, సినిమాటోగ్రఫీ అందించారు. సినిమాటోగ్రాఫర్ భాస్కర్, ఇషా తల్వార్ సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

తారక రత్న మాట్లాడుతూ

తారక రత్న మాట్లాడుతూ


అద్భుతమైన సినిమా. నిర్మాత సాయికొర్రపాటిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. చంద్రబాబునాయుడుగారు, బాలయ్యగారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

సాయి కార్తీక్ మాట్లాడుతూ

సాయి కార్తీక్ మాట్లాడుతూ


పెద్ద సినిమాలో నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు రోహిత్ గారు సహా అందరికీ థాంక్స్ అన్నారు.

దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ

దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ


రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం సాయికొర్రపాటి, నారారోహిత్ గారే కారణం అన్నారు.

హీరోయిన్

హీరోయిన్


ఇషా తల్వార్ మాట్లాడుతూ ‘'ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

English summary
Raja Cheyyi Vesthe Movie Audio Launch event held at Vijayawada. N Chandrababu Naidu, Nandamuri Balakrishna, Nara Rohit, Isha Talwar, Nandamuri Taraka Ratna, Pradeep, Sai Korrapati, Sai Karthik, Jhansi graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu