»   »  రాజా చెయ్యి వేస్తే...: నారా వర్సెస్ నందమూరి

రాజా చెయ్యి వేస్తే...: నారా వర్సెస్ నందమూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో నారా రోహిత్ సైలెంట్‌గా దూసుకుపోతున్నాడు. పది సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. దాంతో ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా రాజా చెయ్యి వేస్తే.. అనే సినిమా అంగీకరించాడు. ఈ సినిమా కోసం ఆసక్తికరమైన కాంబినేషన్‌ ముందుకు వస్తోంది.

కొత్త దర్శకుడు ప్రదీప్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తారకరత్న విలన్‌గా నటిస్తున్నాడు. నందమూరి వారసుల్లో ఒక్కడిగా సినీ తెర మీదికి వచ్చిన తారకరత్న నిలదొక్కుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు.

Raja Cheyyi vesthe: Nara vs Nandamuri

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో తారకరత్న విలన్ పాత్ర పోషించి మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ ఓ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. నారా రోహిత్ ఆ సినిమాలో హీరో కావడం, తారకరత్న విలన్‌గా నటించడం హాట్ టాపిక్‌గా మారింది.

వారాహి చలనచిత్ర బ్యానర్‌పై విజయవంతమైన సినిమాలు నిర్మించిన కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ కెరీర్‌లో ఇది పూర్తి నిడివి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నారా వర్సెస్ నందమూరి ఫార్ములా తెరపై ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

English summary
Tarakaratna is playing a villain role in Raja Cheyyi vesthe film, in which Nara rohit is playing lead role.
Please Wait while comments are loading...