»   » రవితేజ కాళ్లు కడిగి పెళ్లి చేశాను.. ఏరా అంటే.. వెళ్లిపొమన్నాడు..

రవితేజ కాళ్లు కడిగి పెళ్లి చేశాను.. ఏరా అంటే.. వెళ్లిపొమన్నాడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు రాజా రవీంద్ర పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సమయంలోనే పలు హీరోలకు మేనేజర్‌గా మారాడు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు ఇవే..

 రవితేజకు కాళ్లు కడిగి పెళ్లి చేసింది నేనే

రవితేజకు కాళ్లు కడిగి పెళ్లి చేసింది నేనే


ఆర్టిస్ట్ కావడానికి ముందే నేను రవితేజ క్లోజ్. రుద్రనేత్ర తీసిన అజయ్ నాకు రవితేజ కజిన్. దాంతో మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. రవితేజ కాళ్లు కడిగి పెళ్లి కూడా చేశాను.

నన్ను మేనేజర్ చేసింది రవితేజనే

నన్ను మేనేజర్ చేసింది రవితేజనే

రవితేజ బిజీగా అవుతున్న సమయంలో నా డేట్స్ చూడమన్నాడు. అందరి బాగుంటావని నన్ను మేనేజర్ చేశాడు. ఆ తర్వాత సునీల్, నిఖిల్, రాజ్ తరుణ్, విష్ణు, జయసుధ డేట్స్ చూస్తున్నాను.

 ఏరా అంటే అసౌకర్యానికి ఫీలయ్యాడు

ఏరా అంటే అసౌకర్యానికి ఫీలయ్యాడు


రవితేజ మధ్య విభేదాలు లేవని, చాలా రోజులుగా కలిసి ఉన్నాం కనుక బోర్ కొట్టినట్టు ఉన్నది. నేను రవితేజను ఏరా అని పిలిచేవాడిని. అందువల్ల కొంత అసౌకర్యానికి గురయ్యాడు. అది నచ్చకపోవచ్చు. అందుకే ఏడాదిపాటు నా పని నేను చూసుకొంటాను. నీ పని నీవు చూసుకో అని రవితేజ అన్నాడు. దాంతో మేం ఇద్దరం దూరంగా ఉండాలని అనుకొన్నాం.

 రవితేజతో ఆర్థికపరమైన విభేదాలు లేవు.

రవితేజతో ఆర్థికపరమైన విభేదాలు లేవు.


రవితేజ నాకు మధ్య ఎలాంటి ఆర్థికపరమైన విభేదాలు లేవు. ఈ మధ్య ఎవరో ఓ వెబ్‌సైట్ రాశారు. వాళ్లు చెప్పినట్టు ఏమిలేదు. రవితేజ కుటుంబానికి, నాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

 ఒక ఏడాది విడిపోదామనుకొన్నాం

ఒక ఏడాది విడిపోదామనుకొన్నాం


డేట్స్ మాత్రమే చూసుకొన్నాను. మనీ టాన్సాక్షన్ ఏమీ చేయలేదు. ఆ విషయాలను రవితేజ మాత్రమే చూసుకొనేవాడు. బయట చెప్పుకొన్నంతగా మా మధ్య ఆర్థిక విభేదాలు లేవు.

English summary
Raja Ravindra said He actively played role in Raviteja marriage. We separated for a while for Some personal differences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu