»   »  వర్మ 'పట్టపగలు' ఫస్ట్ లుక్ (ఫోటోలు)

వర్మ 'పట్టపగలు' ఫస్ట్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ వరస ఫ్లాపుల హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసారు. ఆ ఫస్ట్ లుక్ హర్రర్ ఎఫెక్ట్ వచ్చేలా రూపొందించారు.

ఇక ఈ రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కొత్తగా ఉంటుందని ఖచ్చితంగా భయపెడుతుందనే నమ్మకంతో యూనిట్ వర్గాలు ఉన్నట్లు చెప్తున్నారు.

స్లైడ్ షోలో....ఫస్ట్ లుక్ ఫోటోలు

హర్రర్ స్పెషలిస్ట్..

హర్రర్ స్పెషలిస్ట్..

వర్మకు హర్రర్ చిత్రాలు కొత్తేమీ కాదు. దెయ్యం, రాత్రి,బూచి వంటి అనేక హర్రర్ చిత్రాలు గతంలో ఆయన నుంచి వచ్చాయి. అయితే చాలా భాగం వాటిలో విజయం సాధించలేదు. కానీ ఆయన ఎలాగైనా భయపెట్టాలని తీస్తూనే ఉన్నారు.

షూటింగ్ డేస్

షూటింగ్ డేస్

దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ సైతం పూర్తైందని అంటున్నారు.

గ్యాప్ తర్వాత రాజశేఖర్

గ్యాప్ తర్వాత రాజశేఖర్

రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

నిర్మాత

నిర్మాత

ఈ చిత్రం రాజశేఖర్ నిర్మించారని సమాచారం. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఆయన కమ్ బ్యాక్ ఫిలిం గా మారుతుందని భావిస్తున్నారు.

హీరోయిన్...

హీరోయిన్...

గతంలో బ్రేక్ అప్ చిత్రంలో నటించిన స్వాతి దీక్షిత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఆమె నటన సినిమాకి హైలెట్ అవుతుందంటున్నారు.

నేచురల్ లుక్

నేచురల్ లుక్

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ విభిన్నంగా తన నేచురల్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. హీరోయిన్ కి తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

English summary
Ram Gopal Varma's Upcoming Horror Film Patta Pagalu First Look released today , as the Poster Clarifies the Movie was Coming soon and the Film Starring Raja Shekar and Directed by Rgv. As per the Source this Movie shooting already Wrapped up and going to release soon at any time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu