»   » రవితేజ ‘రాజా ది గ్రేట్’ థియేట్రికల్ ట్రైలర్

రవితేజ ‘రాజా ది గ్రేట్’ థియేట్రికల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ శుక్రవారం రిలీజ్ చేశారు. టైటిల్ కు తగిన విధంగానే సినిమా చాలా గ్రేట్ గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుని పాత్రలో కనిపించబోతున్నాడు. లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకు ఇవ్వదు. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి. బాధ నుండి సంతోషం అయినా... ఓటమి నుండి గెలుపైనా....అంటూ రవితేజ డైలాగులు ఇరగ దీశారు.

ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఈ చిత్రంలో రవితేజ పేరు ‘రాజా ది గ్రేట్' గుడ్డి వాడు తనకు ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్.

దిల్ రాజు మూవీ

దిల్ రాజు మూవీ

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `రాజా ది గ్రేట్`. `వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌` క్యాప్ష‌న్‌.

రొమాంటిక్ పోర్షన్

రొమాంటిక్ పోర్షన్

ఈ సినిమాలో రవితేజ యాక్షన్ పోర్షన్ తో పాటు.... హీరోయిన్ మెహ్రీన్‌తో జరిగే రొమాంటిక్ పోర్షన్ కూడా ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది.

ఔట్ అండ్ ఔట్ ఎంటర్టెనర్

ఔట్ అండ్ ఔట్ ఎంటర్టెనర్

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ....ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.

ట్రైలర్

‘రాజా ది గ్రేట్' చిత్రాన్ని దిపావళి సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Watch Raja The Great Trailer starring Ravi Teja, Mehreen Pirzada, Produced by Dil Raju & Directed by Anil Ravipudi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu