»   » ‘దంగల్’ విజయం మాకు ప్లస్సవుతుంది: రాజమౌళి

‘దంగల్’ విజయం మాకు ప్లస్సవుతుంది: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి -2' మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ సంచలనాలు నమోదు చేసింది. అప్పటి వరకు ఉన్న అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను తుడిచేసి నెం.1 పొజిషన్ దక్కించుకుంది. అయితే ఈ పొజిషన్ ఎంతో కాలం నిలవలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకే 'దంగల్' మూవీ చైనాలో రిలీజ్ అవ్వడం..... బాహుబలి-2 రికార్డులన్నింటినీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా 'దంగల్' నెం.1 అయింది.

చైనాలో రిలీజ్ అవ్వడం 'దంగల్‌'కు బాగా కలిసొచ్చింది. ఒక్క చైనాలోనే ఈ చిత్రం రూ. 2 వేల కోట్లు వసూలు చేయడమే ఇందుకు కారణం. ఇక్కడ 'దంగల్' చిత్రానికి ఊహించని రెస్పాన్స్ లభించింది.


Rajamouli about Dangal's extraordinary success

జులైలో 'బాహుబలి-2' కూడా చైనాలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే 'దంగల్' చిత్రానికి వచ్చినంత రెస్పాన్స్ 'బాహుబలి-2'కు కూడా వస్తుందని కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే గతంలో 'బాహుబలి-1' చిత్రం చైనాలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.


దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ...'దంగల్' మూవీ సక్సెస్ మాకు హెల్ప్ అవుతుంది. 'దంగల్' తర్వాత భారీగా విడుదలవుతున్న మరో ఇండియన్ మూవీ ఇది. అందువల్ల వారు ఈ చిత్రాన్ని ప్రత్యేక చిత్రంగా భావించే అవకాశం ఉంది అన్నారు. 'బాహుబలి-1' కంటే 'బాహుబలి-2' చిత్రం ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వబోతోంది. చైనాలో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నామని రాజమౌళి తెలిపారు.


English summary
Rajamouli responded positively on the Dangal's extraordinary success. He is saying that 'Dangal' success will help their film in China.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu