»   »  నేనే బాస్... మా నాన్న కాదు: రాజమౌళి

నేనే బాస్... మా నాన్న కాదు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లలో టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. రాజమౌళి తన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1' నుండి ‘బాహుబలి-ది బిగినింగ్' వరకు వీరి కాంబినేషన్లో టాలీవుడ్లో ఎన్నె హిస్టారికల్ హిట్స్ వచ్చాయి.

‘బాహుబలి-ది బిగినింగ్' మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూను ప్రముఖ మేగజైన్ ‘ఫోర్బ్స్' ప్రచురించింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ విమర్శకుడు, ఫిల్మ్ మేకర్ రోబ్ కేన్ ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు. కథా చర్చల సమయంలో మీరు, మీ నాన్న ఇద్దరిలో ఎవరు బాస్ లా వ్యవహరిస్తారు? అనే ప్రశ్నకు రాజమౌళి నిజాయితీగా జమాధానం ఇచ్చారు. ‘నేనే బాస్...డైరెక్టర్ నేనే కాబట్టి నేనే బాస్' అని సమాధానం ఇచ్చారు.

 Rajamouli about his Dad

తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి పని చేసేప్పుడు తాను ఎలా మసులుకుంటాను అనే విషయాన్ని రాజమౌళి చెబుతూ...‘ తాము తండ్రీ కొడుకులం అయినప్పటికీ పని విషయంలో ఇద్దరం ప్రొఫెషనల్ గా ఉంటాం. మొహమాటం లేకుండా నచ్చింది, నచ్చనిదీ ఒకరికొకరం షేర్ చేసుకుంటామని తెలిపారు. బాహుబలి ఫస్ట్ పార్టుకు వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్టుకు సంబంధించిన స్క్రిప్టును ఇద్దరం కలిసి ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నామని తెలిపారు.

English summary
To one of the questions shot by popular critic and filmmaker Rob Cain about who the boss is between him and his father while discussing a story, prompt came the reply from Jakkanna - 'I'm the boss, obviously. I'm the director and I'm the boss.'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu