»   »  అల్లు అరవింద్ వల్లే వసూళ్లు తగ్గాయి: రాజమౌళి

అల్లు అరవింద్ వల్లే వసూళ్లు తగ్గాయి: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 500 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర' సినిమా కూడా భారీగా వసూళ్లు సాధించి అప్పట్లో తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘మగధీర' సినిమా తీసిన‌ప్పుడే తాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయాల‌ని నిర్మాత అల్లు అర‌వింద్‌కు సూచించాన‌ని, కానీ తెలుగులో విడుదలైన సంవ‌త్స‌రం త‌ర్వాత త‌మిళంలో రిలీజ్ చేశారు. అయినప్పటికీ రూ.4 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసింది. తాను చెప్పినట్లు చేస్తే మగధీర వసూళ్లు మరింత పెరిగి ఉండేవని రాజమౌళి తెలిపారు.

 Rajamouli about Magadheera

బాహుబలి సినిమా విషయానికొస్తే...
బాహుబలి సినిమా రూ. 500 కోట్ల వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి. హిందీయేతర సినిమాలు రూ 500 మార్కును అందుకున్న దాఖలాలు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే ఆ ఘనట సాధించాయి అందుకున్నాయి.

బాహుబలి సినిమా నాలుగో వారంలోనూ ప్రపంచ వ్యాప్తంగా 2000లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. సినిమాకు విడుదలైన ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. త్వరలో రాజమౌళి ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి ఫార్ట్ 1 భారీ విజయం సాధించడంతో రెండో భాగం...... పార్ట్ 2ను బాలీవుడ్ స్టార్లయిన హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లతో తీస్తే మంచి ఫలితాలు వస్తాయని కరణ్ జోహార్ సూచించాడట. అయితే రాజమౌళి అందుకు టెమ్ట్ కాలేదు, తాను ముందుకు అనుకున్న ప్రకారం ప్రభాస్, రానాలతోనే సెకండ్ పార్ట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.

English summary
Rajamouli about Magadheera movie collections.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu