»   » అల్లు అరవింద్ మీద చాలా కోపాలున్నాయి, రాను అని చెప్పాను: రాజమౌళి

అల్లు అరవింద్ మీద చాలా కోపాలున్నాయి, రాను అని చెప్పాను: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' భారీ విజయంతో దర్శకుడు రాజమౌళి పేరు ఈ దేశం మొత్తం మార్మోగిపోతోంది. కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా 'బాహుబలి' సినిమా, దర్శకుడు రాజమౌళి గురించే హాట్ హాట్ టాపిక నడుస్తోంది.

నిర్మాతలతో పాటు హీరో ప్రభాస్, మగధీర టీం మొత్తం ఈ సినిమా విజయం క్రెడిట్ అంతా రాజమౌళికే ఇచ్చారు. ఇదే రాజమౌళి గతంలో 'మగధీర' లాంటి భారీ విజయాన్ని తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. మగధీర అంత గ్రేట్ సక్సెస్ కు వెళ్లినపుడు రాజమౌళి ప్రాధాన్యతను ఎక్కడా నిర్మాతలు పంచుకోలేదు, ఆయనకు క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి.

వివరణ ఇచ్చిన రాజమౌళి

వివరణ ఇచ్చిన రాజమౌళి

‘మగధీర' తర్వాత మళ్లీ మెగా ఫ్యామిలీతో సినిమా చేయక పోవడం కూడా..... తనకు క్రెడిట్ ఇవ్వక పోవడం వల్లే రాజమౌళి హర్టయ్యాడనే వాదనకు మరింత బలం పెరిగింది. ఈ వాదనపై రాజమౌళి తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ ఇంటర్వ్యూ విడుదల కానుంది.

అల్లు అరవింద్ మీద చాలా కోపాలున్నాయి

అల్లు అరవింద్ మీద చాలా కోపాలున్నాయి

నాకు నిర్మాత అరవింద్ గారి మీద కోపాలు చాలా ఉన్నాయని, 100 డేస్ ఫంక్షన్ కి నేను రాలేను అని అపుడు చెప్పానని రాజమౌళి తెలిపారు. అయితే మరి రాజమౌళికి కోపం తెప్పించే పని అల్లు అరవింద్ అప్పట్లో ఏం చేసాడనేది విషయం..... ఫుల్ ఇంటర్వ్యూలో వెల్లడికానుంది.

అదే బెస్ట్ కాంప్లిమెంట్

అదే బెస్ట్ కాంప్లిమెంట్

మీకు వచ్చిన అన్ని అభినందనల్లోకి ఏది బెస్ట్ అనిపించింది అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ...... బాహుబలి లాంటి సినిమా నా మీద ఆడటానికే నేను పుట్టింది అనే ప్రశంసలు విన్నపుడు చాలా ఆనందంగా ఉంటుంది. అదో హ్యూజ్ కాంప్లిమెంట్ అని రాజమౌళి తెలిపారు.

మా అదృష్టం కొద్దీ శ్రీదేవి ఓకే చేయలేదు

మా అదృష్టం కొద్దీ శ్రీదేవి ఓకే చేయలేదు

శివగామి పాత్రకు ముందుగా రమ్యకృష్ణనే అనుకున్నాం. అయితే హిందీలో మార్కెట్ పెంచాలనే ఉద్దేశ్యంతో శ్రీదేవిగారిని ఆ పాత్రకోసం తర్వాత సంప్రదించాం. మా అదృష్టం కొద్ది శ్రీదేవి గారు ఓకే చేయలేదు. శివగామిగా రమ్యకృష్ణ ఎంతో అద్భుతంగా చేసారు అని రాజమౌళి తెలిపారు.

మహాభారతంపై వివరణ

మహాభారతంపై వివరణ

మహాభారతం ఇప్పుడైతే తీయను. నేను అలాంటి సినిమా తీయాలంటే నాకు ఇంకా చాలా అనుభవం, టెక్నికల్ క్యాపెబిలిటీస్ కావాలి. ప్రస్తుతానికి అలాంటి సినిమా తీయగల సత్తా నాలో ఉందో? లేదో? అనే నా మీద నాకే సెల్ఫ డౌట్ ఉంది అని రాజమౌళి తెలిపారు.

అలా అంటే ప్రభాస్ ఇబ్బంది పడతాడు

అలా అంటే ప్రభాస్ ఇబ్బంది పడతాడు

ప్రభాస్‌ను ఎప్పుడైనా ఏడిపించడానికి..... సార్ ఏం ప్రభాస్ రాజు గారు అని పిలిస్తే చాలా ఇబ్బంది పడిపోతాడు. ప్రభాస్ విషయంలో మాత్రం తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని రాజమౌళి తెలిపారు.

నేను చదుకుంది ఇంటర్మీడియట్టే, నేనేం చేయగలను

నేను చదుకుంది ఇంటర్మీడియట్టే, నేనేం చేయగలను

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘అమరావతి' నిర్మాణంలో మీ సహాయ సహకారాలు కావాలని ఆశ పడుతున్నారు. ఏమైనా చెయ్యి ఏస్తారా? అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ.... నేను డైరెక్టర్ను, నా వల్ల ఏం అవుతుంది సార్.... నేను కేవలం ఇంటర్మీడియటే చదువుకున్నాను. నాకు ఉన్నది కేవలం సినిమా నాలెడ్జి మాత్రమే అని సమాధానం ఇచ్చారు.

English summary
Rajamouli about Magadheera and Baahubali movies. Check out full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu