»   » భళ్లాలదేవ కు బర్త్‌డే విషెస్‌ : రాజమౌళి

భళ్లాలదేవ కు బర్త్‌డే విషెస్‌ : రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' తో తనకంటు ఓగుర్తింపు తెచ్చుకున్న నటుడు దగ్గుబాటి రానా. రాజా పుట్టినరోజు ఈరోజు(డిసెంబర్‌ 14) గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.

విక్టరీ వెంకటేష్ వారసుడిగా, దగ్గుబాటి కుటుంబం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన ఈ యువ నటుడికి ‘బాహుబలి' దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. సందర్భంగా బాహుబలి సెట్‌లో రానాతో ఉన్న ఫోటోను తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు..

Wishing our Bhallaladeva, Rana Daggubati, a very Happy Birthday!

Posted by SS Rajamouli on 13 December 2015

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు నటించి మంచి నటుడిగా... స్నేహితుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు. బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడిగా ఆయన పోషించిన భళ్లాలదేవ పాత్రకు ప్రశంసల వర్షం కురిసింది.

రానా త్వరలో ప్రారంభం అయ్యే బాహుబలి 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి-ది బిగినింగ్' భారీ విజయం సాధించడంతో పార్ట్-2 షూటింగుకు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. బాహుబలి చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా వసూళ్లు సాధించింది.

Rajamouli birthday wishes to Rana

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 14న ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ‘బాహుబలి-2' షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు పండితులు ముహూర్తం ఖరారు చేసారు. సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు.

బాహుబలి సినిమాలో భల్లాలదేవుడుగా మెప్పించిన రానా దగ్గుబాటి తొలి అవార్డు అందుకోబోతున్నాడు. సౌతిండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసియావిజన్ మూవీ అవార్డ్స్-2015 లకు రానా ఎంపికయ్యాడు. తెలుగు విభాగంలో పెర్ఫార్మెర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రానా దక్కించుకున్నారు.

English summary
Rajamouli shared in fB: Wishing our Bhallaladeva, Rana Daggubati, a very Happy Birthday!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu