»   » మహాభారతం పై జక్కన్న మరో ప్రకటన

మహాభారతం పై జక్కన్న మరో ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహాభారతం కనీసం పదేళ్లకు పైగా పట్టే ప్రాజెక్ట్ అని రెండేళ్ళ కిందటే చెప్పాడు. అయితే బాహుబలి 2 తర్వాత కూడా చేసిన ఇంటర్వ్యూలో మళ్ళీ అదే పదేళ్ళ లెక్క చెప్పటం తో షాకయ్యారంతా మళ్ళీ ఇప్పటినుంచీ పదేళ్ళు అనగానే ఉస్సూరుమన్నారు. అయితే తాజా గా మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి మరో ఎనిమిదేళ్లలోనే మహాభారతం తీసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పి హమ్మయ్య అని పించాడు..

మరో ఎనిమిదేళ్లలోనే

మరో ఎనిమిదేళ్లలోనే

అయితే బాహుబలి 2 తర్వాత కూడా చేసిన ఇంటర్వ్యూలో మళ్ళీ అదే పదేళ్ళ లెక్క చెప్పటం తో షాకయ్యారంతా మళ్ళీ ఇప్పటినుంచీ పదేళ్ళు అనగానే ఉస్సూరుమన్నారు. అయితే తాజా గా మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి మరో ఎనిమిదేళ్లలోనే మహాభారతం తీసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పి హమ్మయ్య అని పించాడు..

మహాభారతాన్ని తెరకెక్కించాలని

మహాభారతాన్ని తెరకెక్కించాలని

బాహుబలి పార్ట్ వన్ పూర్తయినప్పుడే కొన్నాళ్ళలో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నానని రాజమౌళి చెప్పటంతో బాహుబలి తరువాత మహాభారతమే సెట్స్ మీదకు వెళ్తుందని భావించారు. అయితే రాజమౌళి మాత్రం మహాభారతానికి తెర రూపం ఇచ్చేంత అనుభవం తనకింకా రాలేదని అందుకు ఇంకా సమయం పడుతుందని చెపుతూ వస్తున్నాడు.

మోహన్ లాల్ 1000 కోట్ల మహాభారతం

మోహన్ లాల్ 1000 కోట్ల మహాభారతం

తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000 కోట్ల తో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్ లాల్ అంత భారీగా రూపొందించిన తరువాత తిరిగి రాజమౌళి అదే కథను తీస్తాడా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న జక్కన మహాభారతం తీసే ఆలోచనపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

పదేళ్ల ప్రాజెక్టు

పదేళ్ల ప్రాజెక్టు

‘‘మహాభారతం ప్రాజెక్టు నాకు చాలా ఇష్టం. ఐతే వెంటనే ఆ సినిమా చేయాలనుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి మహాభారతంపై రకరకాల వెర్షన్లు చదివాను. చూశాను. మనసులో అది మెగా మెగా మెగా ప్రాజెక్టులాగా ఉంటుంది. అంత పని పెట్టుకోవాలంటే ఇప్పుడే కష్టం. అది పదేళ్ల ప్రాజెక్టు. సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా అనే భయం ఉంది.

చాలా పెద్ద చాలెంజ్

చాలా పెద్ద చాలెంజ్

ఎందుకంటే అందులో కేవలం స్టార్లను పెట్టుకుంటే సరిపోదు. ఆ పాత్రలకు ఎవరు సరిపోతారో పట్టుకుని.. వారిని మౌల్డ్ చేయాలి. అదో పెద్ద పని. చాలా చాలా పెద్ద చాలెంజ్. ఇప్పటి వరకూ అందరి మనసుల్లో ఉండేవన్నీ తీసేసి.. ‘ ' ఇదీ అని చెప్పాలి. అంత ఎనర్జీ లెవెల్స్.. అంత సమయం నా దగ్గర ఉందా అనే సెల్ఫ్ డౌట్ నాకుంది. అయితే కచ్చితంగా చేస్తాను. ఎనిమిదేళ్ల తర్వాత చేస్తాను'' అని రాజమౌళి వివరించాడు.

English summary
Tollywood ace filmmaker SS Rajamouli kept saying 'Mahabharat' is his dream project. He, however, maintained that his knowledge at present isn't sufficient to deal such an epic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu