»   » డాన్స్ చేస్తూ అదరకొట్టిన రాజమౌళి

డాన్స్ చేస్తూ అదరకొట్టిన రాజమౌళి

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రాజమౌళి డాన్స్ చేస్తూ, యాంకరింగ్ చేస్తూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్ లో ఒక పెళ్ళికి సంబంధించి జరిగిన 'సంగీత్' వేడుకకు దర్శకుడు రాజమౌళి యాంకర్‌గా వ్యవహరించారు. అక్కడ హాజరైన వారందరినీ తన మాటలతో హుషారెత్తించడమే కాకుండా, కొన్ని పాటలకు ఆయన ఎంతో హుషారుగా డాన్స్ కూడా చేశారు.

  రెండు గంటలపాటు సాగిన ఈ సరదా వేడుకలో ఆయన సతీమణి రమ కూడా పాల్గొన్నారు. సంగీతదర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి వల్లి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక ప్రముఖ డాక్టరు కుటుంబానికి సంబంధించి జరిగిన ఈ 'సంగీత్' వేడుకలో గురవారెడ్డి వంటి ప్రముఖ డాక్టర్లు కూడా పాల్గొన్నారు.

  ప్రస్తుతం రాజమౌళి తను త్వరలో డైరక్ట్ చేయబోయే ప్రభాస్ చిత్రంపైనే దృష్టి పెట్టారు. ఈ చిత్రం తెలుగు,తమిళ్,హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రంలో బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ ని, మరో సీనియర్ హిందీ నటిని తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో రాజమౌళి చిత్రాల రీమేక్ లకు క్రేజ్ పెరగటంతో ఈ సారి స్టైయిట్ చిత్రంతో బాలీవుడ్ ని పలకరించి హిట్ కొట్టాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్ కి కూడా బాలీవుడ్ లో ఇది లాంచింగ్ సినిమా అవుతుంది.

  బైలింగ్వులవ్ చిత్రాలు రెగ్యులర్ షూటింగ్ తరహాలో కాకుండా గౌతమ్ మీనన్ తరహాలో ప్రతీ సీన్ ని రాజమౌళి హిందీలో ప్రత్యేకంగా షూట్ చేయనున్నారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

  'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.

  English summary
  A sangeet function is an evening of music, dance and dinner that precedes a wedding. Rajamouli and Rama couple danced at a doctors marriage. These songs are sometimes highly emotional and sometimes hilariously humorous. The entire fun and excitement depends upon selecting the right songs.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more