twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవినీతిపై రాజమౌళి రియల్ లైఫ్ ఫైట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి అవినీతికి వ్యతిరేకంగా నిజ జీవిత పోరాటం ప్రారంభించారు. అన్నా హజారే స్ఫూర్తిగా అవినీతిని అంతమొందించడానికి నడుం బిగించారు. 'సురాజ్యం' ఉద్యమం ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగా..మెరుగైన సమాజం కోసం సాగుతున్న ఈ పోరులో భాగస్వాములు కావాలని యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.

    తన సోషల్ నెట్వర్కింగ్ పాటు, ఏబీఎన్ ఛానల్ యువతను చైతన్య పరిచేందుకు నిర్వహిస్తున్న యంగిస్థాన్ కార్యక్రమం ద్వారా ఈ అవినీతి వ్యతిరేక 'సురాజ్యం' ఉద్యమం గురించి ప్రచారం ప్రారంభించారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పలు షార్ట్ ఫిలింస్ నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. రాజమౌళి లాంటి ప్రముఖులు అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మనమూ ఆయనతో చేతులు కలుపుదాం...అవీనీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ఊతమిద్దాం.

    ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే...ఈగ సినిమా తర్వాత ప్రభాస్‌తో సినిమాకు సిద్ధమౌతున్న జక్కన్న అందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

    'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు.

    ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.

    English summary
    Ace Director Rajamouli is influenced by Anna Hazare, this honest man raised his voice against corruption. The director earlier hosted a TV show in a leading channel he shared his thoughts with college students and said his Twitter followers to join the surajyam movement by making short films, skits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X