రాజమౌళికి జపాన్ నుంచి వచ్చిన గిఫ్ట్స్.. అంతా బాహుబలి మయం!
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని మెప్పించిన బాహుబలి2 చిత్రం జపాన్ లో కూడా అద్భుతంగా ప్రదర్శించబడుతోంది. ఇటీవల జరిగిన 100 రోజుల వేడుకలో కూడా చిత్ర యూనిట్ పాల్గొంది. ఇండియాలో బాహుబలి 2 చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చైనాలో కూడా బాగా ఆడినప్పటికీ రికార్డులు సాధించలేకపోయింది.
బాహుబలి 2 చిత్రం ద్వారా రాజమౌళి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. జపాన్ లో బాహుబలి చిత్ర మానియా నడుస్తోంది. వందరోజుల వేడుకలో పాల్గొన తిరిగి వచ్చాక బాహుబలి టీంకు జపాన్ నుంచి గిఫ్ట్స్ వెల్లువలా వచ్చాయట. ఆ గిఫ్ట్స్ ని బాహుబలి చిత్ర తాజగా ఓపెన్ చేసింది. బాహుబలి చిత్రానికి సంబందించిన కార్టూన్స్ ని జపాన్ అభిమానులు పంపారు.

ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బాహుబలి చిత్రం కోసం చాలా దేశాల్లో పర్యటించామని కానీ జపాన్ మాత్రం ప్రత్యేకం అని జక్కన్న తెలిపాడు. బాహుబలి చిత్రం విడుదలై ఏడాది దాటిపోయినా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











