»   » రాజమౌళి కి ట్రైలర్ బాగా నచ్చిందంటూ ట్వీట్

రాజమౌళి కి ట్రైలర్ బాగా నచ్చిందంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు తను చూసిన సినిమాలు గురించి, తనకు నచ్చిన ట్రైలర్స్ గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి అప్ డేట్స్ ఇస్తూంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను 'రామ్ లీలా' ట్రైలర్ ఆకట్టుకుందని ట్వీట్ చేసారు. 'రామ్ లీలా' సినిమా సంజయ్ లీలా భన్సాలి తెరకేక్కిస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ప్రముఖులందరూ ఈ ట్రైలర్ ను ట్విట్టర్ లో ప్రశంశించారు.

"వావ్... సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా ట్రైలర్ చూసాను... మైండ్ బ్లోయింగ్ విజువల్స్ . స్టన్నింగ్ అయ్యేలా ఒకే ఫ్రేమ్ లో ఎలా కూర్చారో... !" అంటూ అద్బుతమైన విజువల్స్ అని, ప్రతీ ఫ్రేమ్ నిజంగా కనులవిందు అని మెసేజ్ చేసాడు.

<blockquote class="twitter-tweet blockquote"><p>Ramleela trailer..wow.. Mind boggling visuals from Sanjay leela bhansali. How can he cram so much into one frame and yet make it stunning.!</p>— rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/statuses/381012100258091009">September 20, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
బాలీవుడ్ లో బెంగళూరు భామ దీపికా పదుకోనె, రాణ్ వీర్ సింగ్ ల మధ్య తెరమీదే కాకుండా బయటకూడా ప్రేమాయణం జోరుగానే సాగుతోందని ముంబై సినీ బజార్ లో రూమర్లు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో బెంగళూరు భామ దీపికా పదుకోనె, రాణ్ వీర్ సింగ్ ల మధ్య తెరమీదే కాకుండా బయటకూడా ప్రేమాయణం జోరుగానే సాగుతోందని ముంబై సినీ బజార్ లో రూమర్లు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి.

బాలీవుడ్ లో ఏ నోట విన్నా దీపికా, రణ్ వీర్ ల హల్ చల్ గురించేనని మీడియా కోడైకూస్తోంది. వీరిద్దరూ కలిసి సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో నటిస్తున్నారు.ఇటీవల దీపికా, రణ్ వీర్ లపై హాట్ హాట్ గా లవ్ సీన్లను షూటింగ్ చేశారన్న వార్త బాలీవుడ్ లో సెన్సెషనల్ టాపిక్ గా మారింది. ఓ అందమైన చారిత్రాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో రామ్ పాత్రలో రణ్ వీర్, గుజరాతీ అమ్మాయి లీలాగా దీపికా నటిస్తోంది. భారీ అంచనాలు ఈ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించింది.

English summary
Ram leela tweeted “Ramleela trailer..wow.. Mind boggling visuals from Sanjay leela bhansali. How can he cram so much into one frame and yet make it stunning.!”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu