Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాహుబలి : ఆ.. నిజాలు బయటపెట్టిన రాజమౌళి
'వరుణ దేవుడు కరుణిస్తే జూన్ 6 నుంచి తొలి షెడ్యూల్ మొదలు పెడతాం. ఆ రోజు మొదలైతే సరిగా 'ఈగ' విడుదలైన సంవత్సరానికి బాహుబలి మొదలైనట్లు అవుతుంది' అని రాజమౌళి చెప్పుకొచ్చారు. అంతే కాదు సినిమా ఇటీవల ప్రచారంలోకి వచ్చి రూమర్లకు జవాబు ఇచ్చారు రాజమౌళి.
'బాహుబలి సినిమాను ఐమాక్స్ కెమెరాల్లో చిత్రీకరిస్తున్నట్లు రూమర్లు విన్నాను. కానీ ఆ రూమర్లలో నిజం లేదు. మేము ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించబోతున్నాం. అదే విధంగా 3 రోజుల షూటింగు కోసం 10 కోట్ల ఖరీదు చేసే సెట్ వేసామనే వార్త కూడా నిజం కాదు' అని రాజమౌళి ట్విట్టర్లో స్పష్టమైన వివరణ ఇచ్చారు.
'సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నాము. అయితే హిందీ, మలయాళంలో కూడా విడుదల చేస్తాం. ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన ఉంది. డీల్ కుదిరాక ఇతర ఫారిన్ లాంగ్వేజ్ లలో రిలీజ్ విషయాన్ని అనౌన్స్ చేస్తాం. తొలి షెడ్యూల్ వారం రోజుల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల డిఫరెంట్ ప్లేసుల్లో జరుపుతాం' అని తెలిపారు.
దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.
అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.