twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గారికి ఇష్టం ఉండదు.. ఏపీ సీఎం భేటీ తరవాత రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

    |

    చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు విషయం టాలీవుడ్ సినీ పరిశ్రమను వేధిస్తోంది. అయితే ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు చిరంజీవి సహా సినీ ప్రముఖులు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. మహేష్ బాబు రాజమౌళి సహా మరికొందరు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు

    Recommended Video

    Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
     టెన్షన్ లో ఉన్నా ము

    టెన్షన్ లో ఉన్నా ము

    చిరంజీవి మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మహేష్ బాబు ముందుగా చిరంజీవి గారికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తమ తరఫున ఈ విషయంలో సర్వ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి చిరంజీవి వెళ్లడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆరు ఏడు నెలల నుంచి సినీ పరిశ్రమలో సినిమాలు విడుదల చేయాలా చేయకూడదా ? అని టెన్షన్ లో ఉన్నామని అన్నారు.

    ఒక్క రోజులో క్లియర్

    ఒక్క రోజులో క్లియర్


    సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఏం చేయాలి? అనే విషయం మీద చాలా టెన్షన్ వాతావరణం నెలకొందని అలాంటి టెన్షన్ అంతా ఈ ఒక్క రోజులో క్లియర్ అయిపోయింది అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చర్చలు సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు అని మహేష్ బాబు పేర్కొన్నారు.

    ఆశ్చర్యపోయా

    ఆశ్చర్యపోయా

    తర్వాత మీడియాతో మాట్లాడిన రాజమౌళి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి సినీ పరిశ్రమ మీద ఉన్న అవగాహనకు నిజంగా తాను ఆశ్చర్యపోయానని అన్నారు. సినీ పరిశ్రమ కష్టాలు ఏమిటి? పెద్ద సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఏమిటి? చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఏమిటి? ఇలా ప్రతి ఒక్క అంశం మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవగాహన ఉందని నిజంగా తను చాలా ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.

    ఇండస్ట్రీకి పెద్ద

    ఇండస్ట్రీకి పెద్ద

    ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను అని పేర్కొన్న రాజమౌళి చాలా ఓర్పుతో ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు విన్న జగన్ మోహన్ రెడ్డి తమకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. ఈ భేటీకి చొరవ తీసుకున్న మంత్రి పేర్ని నాని గారికి థాంక్స్ అని పేర్కొన్న ఆయన చిరంజీవి గారికి పెద్ద అనడం ఇష్టం ఉండదు.. కానీ ఇప్పుడు ఆయన చేసిన పనులే నిరూపించాయి ఆయన ఇండస్ట్రీకి పెద్ద అని.. సీఎంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థాంక్స్ అని అన్నారు.

    ప్రభాస్ ఏమన్నారంటే?

    ప్రభాస్ ఏమన్నారంటే?


    మహేష్ తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ ఈ విషయంలో సీఎం గారు ఇండస్ట్రీ సమస్యల గురించి చాలా అర్థం చేసుకున్నారని అన్నారు. సమస్యలపై పాజిటివ్‌గా స్పందించినందుకు ఆయనకు థ్యాంక్స్ అని అన్నారు. 6, 7 నెలల నుంచి మేమంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నాం అని ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నందుకు చిరంజీవి గారికి, పేర్ని నాని గారికి థాంక్స్ అని ప్రభాస్ పేర్కొన్నారు.

    English summary
    Rajamouli, Prabhas and Mahesh Babu spoke to the media after meeting AP CM YS Jagan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X