»   » ‘మేరా భారత్ మహాన్’...అసలు రాజమౌళికి సంబంధమే లేదట!

‘మేరా భారత్ మహాన్’...అసలు రాజమౌళికి సంబంధమే లేదట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గురించి కొన్ని రోజులుగా మీడియాలో ఓ వార్తల చక్కర్లు కొడుతోంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో రాజమౌళి 'మేరా భారత్ మహాన్' పేరుతో ఓ సినిమా చేస్తున్నారని, బాలీవుడ్ నటుడు సన్నీ డియోన్ ఈచిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారని, సన్నీ డియోల్‌‍తో పాటు ఆయన తండ్రి ధర్మేంద్ర కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రాజెక్టు నిజమే కానీ... రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతుందని అంటున్నారు. ఈ చిత్రానకి దర్శకత్వం వహిస్తుంది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. 'బజరంగీ భాయిజాన్' చిత్రానికి కథ అందించడం ద్వారా గతేడాది బాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ మరో అద్భుతమైన స్క్రిప్టుతో బాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

 Rajamouli is in no way involved in Sunny Deol's project

దేశ భక్తికి సంబంధించిన కథను సిద్ధం చేసకున్న విజయేంద్ర ప్రసాద్ 'మేరా భారత్ మహాన్' చిత్రాన్ని సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాజమౌళి ప్రమేయం అసలు ఉండబోదని అంటున్నారు.

ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి-2' సినిమాను తెరకెక్కించడంలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన 'బాహుబలి-2' ప్రాజెక్టు గురించి తప్ప మరే సినిమా గురించి కూడా ఆలోచించడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

English summary
“Vijayendra Prasad is writing and directing Mera Bharat Mahaan. Sunny Deol will play the lead. Rajamouli is in no way involved with the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu