»   » మళ్లీ 'మగధీర' కథేనా? రాజమౌళి 'ఈగ' పై కామెంట్స్

మళ్లీ 'మగధీర' కథేనా? రాజమౌళి 'ఈగ' పై కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు.మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి. చాలా చాలా ప్రయోగాత్మక చిత్రం. అంటూ రాజమౌళి తన తాజా చిత్రం 'ఈగ' లాంచింగ్ సందర్బంగా స్టోరీ పాయింట్ ని రివిల్ చేసారు. అయితే ఈ కథ అనుకున్నంతం రెస్పాన్స్ తేలేకపోయింది. రాజమౌళి సూపర్ హిట్ మగధీర ను గుర్తు చేసేలా పునర్జన్మ, పగ తోనే మళ్ళీ కథ అల్లటం చాలా మంది ఆయన ప్యాన్స్ కు నచ్చటం లేదు. ఈగ ని ప్రధాన పాత్రలో పెట్టి తీస్తున్నాడనగానే ఎంతో ఊహించుకున్నామని, కథ చూస్తే ఇలా ఉందేంటని వాపోతున్నారు. అయితే రాజమౌళి పాయింట్ ఏది తీసుకున్నా జన రంజకంగానే మలుస్తాడనేది గత చిత్రాలు ప్రూవ్ చేసాయి. అందులోనూ ఈగ ప్రధాన పాత్ర కాబట్టి మంచి పబ్లిసిటీ వస్తుంది. అలాగే ఈగ చేసే చర్యలు చాలా చోట్ల నవ్విస్తాయని కూడా చెప్తున్నారు. రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో తీయటం కూడా మార్కెట్ పరంగా లాభసాటి వ్యాపారమేనంటున్నారు. మరో ప్రక్క టెక్నికల్ స్టాండర్డ్స్ కోసం జేమ్స్ ఫౌల్డ్స్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నారు. హిందీలో 'లమ్హే' చిత్రానికి ఆయన ఫెంటాస్టిక్ ఫ్రేమింగ్ వర్క్ చేశారు. చిన్న సైజులో కనిపించే ఈగనీ, పెద్దగా కనిపించే మనుషుల్నీ అనుసంధానం చేయడానికి చాలా కష్టమని, అత్యున్నత నైపుణ్యంతో కూడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాని, సమంత హీరో, హీరోయిన్స్ గా చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu