»   » తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి మరో హింట్ ఇచ్చిన రాజమౌళి

తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి మరో హింట్ ఇచ్చిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నారు? ఎలాంటి సబ్జెక్టు ఎంచుకోబోతున్నారు? ఎంత బడ్జెట్‌లో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుంది? అనే విషయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

బాహుబలి డబ్బుతో.... ఖరీదైన కారు కొన్న రాజమౌళి! (ఫోటోస్)

రాజమౌళి చిన్న బడ్జెట్ సినిమా తీయబోతున్నారని కొందరు... భారీ బడ్జెట్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సబ్జెక్ట్ ఎంచుకున్నారని మరికొందరు ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు బాహుబలి క్రియేటర్.

Rajamouli next: Big movie with out VFX

గతజన్మ రహస్యం: బన్నీకి గుప్తనిధి, పవన్ హత్య, రాజమౌళి ఫెయిల్యూర్, ఎన్టీఆర్ యోధుడు...

ప్రస్తుతం తన తర్వాతి సినిమాపై కసరత్తు చేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. అయితే లోబడ్జెట్ సినిమా తీయడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమా కూడా కాదని క్లారిటీ ఇచ్చారు. విజువల్ ఎపెక్ట్స్‌తో సినిమా తీయడం అంత సులభం కాదన్నారు. తాను తీసే సినిమా చిన్నదైనా, పెద్దదైనా విజువల్ ఎపెక్ట్స్ లేకుండానే తీస్తానని తెలిపారు.

తన తండ్రి విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం ఓ ఎమోషనల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారని, స్ర్కిప్టు సిద్ధమైన తర్వాత.... నటీనటులు, టెక్నీషియన్స్ ఫైనల్ చేస్తామని, అప్పటి వరకు ఏ విషయాలు చెప్పలేనని రాజమౌళి తెలిపారు.

English summary
SS Rajamouli already began focussing on his next project. Condemning the assumption among public, He clarified: 'I am not planning to make a low-budget movie after 'Baahubali'. It's never easy to make a movie with visual effects. Just because I don't want VFX in my next movie doesn't mean, It's going to be a small project. Big projects can be made even without Visual Effects'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu